జనవరి 2020లో : రూ.10వేల లోపు Best స్మార్ట్ ఫోన్లు!

అసలే పండగ సీజన్.. స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఏ బ్రాండ్ మొబైల్ కొనాలని అనుకుంటున్నారు. అద్భుతమైన ఫీచర్లు, డిజైన్ ఆప్షన్లతో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల సిగ్మెంట్లలో ప్రీమియం బడ్జెట్ ఫోన్ల మాదిరిగా ఎన్నో బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి.
హై బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు కొనాలంటే కనీసం రూ.30వేల వరకు ఉండాల్సిందే. కానీ, మీ బడ్జెట్ ఎంత? రూ.10 వేల లోపు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తున్నారా? లేటెస్ట్ చిప్స్ లేదా హై రెజుల్యుషన్ కెమెరాలు లేకపోయినా మీ బడ్జెట్ కు తగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఎన్నో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
2019లో రూ.15వేల రేంజ్ లో రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్ల ధరలు 2020 జనవరి నాటికి భారీగా తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ ఫోన్ల ధరలు కేవలం రూ.10వేలకు లభ్యమవుతున్నాయి. ఈ ఫోన్లలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, హై రెజుల్యుషన్ కెమెరాలు, భారీ బ్యాటరీతో పాటు ఎట్రాక్టీవ్ డిజైన్, ఫీచర్లు ప్రత్యేక ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రస్తుతం.. దేశీయ మార్కెట్లలో రూ.10వేల లోపు లభ్యమయ్యే స్మార్ట్ ఫోన్లకు సంబంధించి జాబితాను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోండి.
1. Redmi Note 7 Pro :
చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ షావోమి సబ్ బ్రాండ్ రెడ్ మి నుంచి రూ.15వేల రేంజులో వచ్చిన బెస్ట్ స్మార్ట్ ఫోన్లలో ఇదొకటి.. 2020లో ఈ ఫోన్ మోడల్ బేసిక్ వేరియంట్ ధర రూ.9,999లకే లభ్యం అవుతోంది. స్టయిలీష్ గ్లాస్ బాడీతో గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, స్నాప్ డ్రాగన్ 675 చిప్ సెట్, 4,000mAh బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇలా మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. డ్యుయల్ కెమెరా సెటప్ 48MP Sony IMX586 sensor ప్రత్యేక ఆకర్షణగా ఉంది. ఎలాంటి వెలుతులోనైనా మంచి ఫొటోలు తీసుకోవచ్చు.
ఫీచర్లు + స్పెషిఫికేషన్లు :
* 6.30 అంగుళాల (1080×2340) డిస్‌ప్లే LTPS
* క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 675
* 4GB ర్యామ్ + 64 GB స్టోరేజీ
* 48MP + 5MP డ్యుయల్ కెమెరా సెటప్
* 13MP ఫ్రంట్ కెమెరా (సెల్ఫీ)
* 4000mAh బ్యాటరీ
* Android Pie ఆపరేటింగ్ సిస్టమ్
2. Redmi Note 8 :
రెడ్ మి నోట్ 7 తో సక్సెస్ సాధించిన రెడ్ మి కంపెనీ.. రెడ్ మి నోట్ 8 మోడల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కొన్ని భారీ అప్ గ్రేడ్స్ తర్వాత రూ.9వేల 999లకే సరికొత్త ఫీచర్లతో తీసుకొచ్చింది. స్నాప్ డ్రాగన్ 665 చిప్ పెయిర్డ్ 4GB ర్యామ్, 64GB స్టోరేజీ అందిస్తోంది. బ్యాటరీ మాత్రం 4000mAh అదే పరిమాణంతో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేలా ఉంది.
కెమెరాల విషయానికి వస్తే.. వెర్షాట్లే క్వాడ్ కెమెరా సెటప్ 48MP మెయిన్ కెమెరాతో 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 2 MP కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్ సైడ్‌లో గొర్రిల్లా గ్లాస్ 5 ప్యానెల్స్, వెనుక వైపు స్పెషల్ గ్రేడియంట్ కలర్ స్కీమ్స్ ఉన్నాయి. 2020 జనవరి 13 నుంచి Redmi Note 8 ధర ఇండియాలో రూ. 8వేల 399లకే లభ్యం కానుంది.
ఫీచర్లు + స్పెషిఫికేషన్లు :
* 6.30 అంగుళాల (1080 x 2280) డిస్‌ప్లే Full HD + స్ర్కీన్
* క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665
* 48MP + 8MP+ 2MP+ 2MP
* 13MP ఫ్రంట్ కెమెరా (సెల్ఫీ)
* 3GB ర్యామ్ + 32GB స్టోరేజీ, 512GB (microSD)
* 4000mAh బ్యాటరీ
* MIUI 10, ఆండ్రాయిడ్ 9 pie ఆపరేటింగ్ సిస్టమ్
* dual-SIM (GSM and GSM)
3. Samsung Galaxy M30 :
సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ రిలీజ్ చేసిన గెలాక్సీ M సిరీస్ ల్లో ఇదొకటి. ఈ మోడల్ ఫోన్ పాతదైనప్పటికీ తక్కువ ధరకే లభ్యమయ్యే ఫోన్లలో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. భారీ 5000mAh బ్యాటరీతో వచ్చిన స్మార్ట్ ఫోన్లలో Galaxy M30 ఒకటి. 6.4 అంగుళాల AMOLED భారీ డిస్ ప్లే ఉంది. ఆండ్రాయిడ్ 10 అప్ డేట్ కూడా త్వరలో రాబోతోంది. 2020లో ఈ ఫోన్ మోడల్ కూడా మంచి డీల్ నడుస్తోంది.
ఇందులో స్పెషల్ ఎట్రాక్షన్ ట్రిపుల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. 13MP మెయిన్ కెమెరాతో పాటు 5MP అల్ట్రా వైడ్ కెమెరా, డెప్త్ కెమెరాలు బాగున్నాయి. హ్యాండ్ సెట్ బాడీ ప్లాస్టిక్ తో ఉన్నప్పటికీ నైస్ గ్రేడియంట్. USB-C పోర్ట్, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని ప్రారంభ ధర మార్కెట్లలో రూ.9వేల 499ల నుంచి లభ్యం అవుతోంది.
ఫీచర్లు + స్పెషిఫికేషన్లు :
* 6.40 అంగుళాల (1080 x 2340) Super AMOLED display
* Samsung Exynos 7904 ప్రాసెసర్
* 13MP + 5MP (అల్ట్రా వైడ్) + 5MP డెప్త్ కెమెరాలు
* 3GB ర్యామ్ + 32GB స్టోరేజీ
* 5000mAh భారీ బ్యాటరీ
* ఆండ్రాయిడ్ 8.1 Oreo OS
* 16MP ఫ్రంట్ కెమెరా
* మెటాలిక్ బ్లూ, స్టేయిన్ లెస్ బ్లాక్ కలర్లు
* 15W ఫాస్ట్ ఛార్జర్, USB-C పోర్ట్