Budget 2025 : మహిళలకు గుడ్ న్యూస్ .. రూ.2 కోట్ల లోన్.. ఎవరెవరికి వస్తుందో చూడండి..!
Budget 2025 : మహిళల కోసం సరికొత్త స్కీమ్ తీసుకువస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ కొత్త పథకంతో చాలా మంది మహిళలకు భారీ ఊరట కలుగనుంది.

Budget 2025 : Govt Rolls Out Rs 2 Cr Term Loans
Budget 2025 : ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ కేంద్ర బడ్జెట్‌లో మహిళలకు ఊరటనిచ్చేలా భారీ ప్రకటన చేసింది. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. తాజా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళలకు న్యూస్ చెప్పారు.
మహిళల కోసం సరికొత్త స్కీమ్ తీసుకువస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ కొత్త పథకంతో చాలా మంది మహిళలకు భారీ ఊరట కలుగనుంది. ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాల మహిళలకు సులభంగా రుణాలు అందేలా ఈ కొత్త పథకం ప్రవేశపెట్టినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.
యూనియన్ బడ్జెట్ 2025-26లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.2 కోట్ల వరకు టర్మ్ లోన్ పథకం కింద షెడ్యూల్డ్ కులాల మహిళా పారిశ్రామిక వేత్తలకు రుణాలను ఇవ్వనుంది. మొదటిసారిగా సొంతంగా వ్యాపారాలను ప్రారంభించే మహిళలకు ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ. 2 కోట్ల వరకూ రుణాలను అందించనున్నారు.
5 లక్షల మంది మహిళలకు ప్రయోజనాలు :
మొత్తం 5 లక్షల మంది మహిళలకు ఈ పథకం కింద ప్రయోజనం పొందనున్నట్టు ఆమె పేర్కొన్నారు. అంతేకాదు.. దేశవ్యాప్తంగా మహిళలు, ఎస్పీ, ఎస్టీ వర్గాలకు ఈ పథకం కింద ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని నిర్మలమ్మ చెప్పారు. దీని ప్రకారం.. ఐదేళ్ల కాలంలో టర్మ్ లోన్స్ అందిస్తామన్నారు.
ఈ స్కీమ్ కేవలం ఎస్సీ, ఎస్టీ మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. స్టాండప్ ఇండియా స్కీమ్ ద్వారా శిక్షణ తీసుకున్న వారికి ఈ పథకంలో చేరేందుకు అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లో బిజినెస్ ఎలా ప్రోత్సహించాలి, నిర్వాహక నైపుణ్యాల అభివృద్ధికి వర్క్‌షాప్‌లను కూడా నిర్వహించనున్నారు.
Read Also : Budget 2025 : మధ్యతరగతి ఉద్యోగులకు భారీ ఊరట.. రూ.12 లక్షల వరకు నో ఇన్‌కం ట్యాక్స్!
ఆర్థిక మద్దతును అందించడమే కాకుండా ఈ పథకం కింద వ్యవస్థాపక, నిర్వాహక నైపుణ్యాలను బలోపేతం చేయనుంది. అదేవిధంగా, ఆన్‌లైన్ సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను కూడా అందిస్తుంది.