Foxconn Chairman Letter CM KCR : సీఎం కేసీఆర్ కు ఫాక్స్ కాన్ ఛైర్మన్ లేఖ.. ‘కొంగరకలాన్‌లో ప్లాంట్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం’
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫాక్స్ కాన్ కంపెనీ చైర్మన్ యాంగ్ లియూ లేఖ రాశారు. కొంగరకలాన్‌లో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం కావాలని కోరారు. వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభిస్తానని చెప్పారు.

Foxconn Company
Foxconn Chairman Letter CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫాక్స్ కాన్ కంపెనీ చైర్మన్ యాంగ్ లియూ లేఖ రాశారు. కొంగరకలాన్‌లో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం కావాలని కోరారు. వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభిస్తానని చెప్పారు. కొంగరకలాన్ పార్క్‌ను ప్రారంభించడంలో ప్రభుత్వం నుంచి మద్దతు కోరుతున్నట్లు తెలిపారు. హన్ హాయ్ టెక్నాలజీ గ్రూప్ చైర్మన్ యాంగ్ లియూ కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. తమ హైదరాబాద్ పర్యటన సందర్భంగా తనకు, తన బృందానికి అందించిన ఆతిథ్యానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
తాము హైదరాబాద్‌లో అద్భుతంగా గడిపామని తెలిపారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తీరుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ‘తెలంగాణ పరివర్తన, అభివృద్ధికి మీ దార్శనికతకు నేను ప్రేరణ పొందాను’ అని అన్నారు. తనకు ఇప్పుడు భారతదేశంలో కొత్త స్నేహితుడు ఉన్నారని పేర్కొన్నారు. ‘భవిష్యత్తులో మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు. మార్చి2వ తేదీన జరిగిన సమావేశంలో తమతో చర్చించినట్లుగా…కొంగరకలాన్‌లో ప్లాంట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఫాక్స్‌కాన్ కట్టుబడి ఉందన్నారు.
‘వీలైనంత త్వరగా కొంగర కలాన్ పార్క్‌ను ప్రారంభించడంలో మీ బృందం మద్దతును కోరుతున్నట్లు వెల్లడించారు. నా వ్యక్తిగత అతిథిగా మిమ్మల్ని తైవాన్‌కు ఆహ్వానిస్తున్నాను.. తైపీలో మీకు ఆతిథ్యం ఇవ్వడం నా గౌరవం.. త్వరలో మిమ్మల్ని కలవడానికి ఎదురుచూస్తున్నాను’ అంటూ చైర్మన్ లియూ లేఖలో పేర్కొన్నారు.