రికార్డు స్థాయిలో 5వేలు పెరిగిన బంగారం ధర

రికార్డు స్థాయిలో 5వేలు పెరిగిన బంగారం ధర

Updated On : February 25, 2020 / 5:07 AM IST

బంగారం ధర గరిష్ఠ స్థాయికి చేరుకుందా.. ఇంకా పెరుగుతుందా అని సామాన్యుడి గుండెల్లో గుబులు మొదలైంది. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోలు చేయాలనుకుంటున్న కస్టమర్లకు ఎదురుచూస్తున్న కొద్దీ పరిగెడుతూనే ఉంది బంగారం. సోమవారం మార్కెట్ ముగిసేనాటికి 24క్యారెట్ల gold rate వంద తక్కువ రూ.45వేలుగా ఉంది. 

రెండు సంవత్సరాలుగా బంగారం పెరుగుతున్న తీరు చూస్తుంటే అత్యధిక స్థానానికి చేరిందా.. రూ.50వేలకు దాటిపోతుందా అని భయం మొదలైంది. 2017 ఫిబ్రవరి 24న 24క్యారెట్ల బంగారం ధర 29వేల 740గా ఉంటే 2020 ఫిబ్రవరి 24న రూ.44వేల 900గా ఉంది. గత ఏడేళ్లలో లేనంతగా గరిష్ఠ ధరకు చేరుకుందని నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

చైనాలో ప్రబలిన కరోనా వైరస్ కూడా ఓ కారణమనే చెప్పాలి. కేవలం భారత్‌లోని ధర మాత్రమే కాకుండా 20 ప్రపంచ దేశాలన్నింటిలోనూ మార్పు కనిపిస్తుంది. అగ్ర రాజ్యం అమెరికాలోనూ బంగారం ధర 1శాతం అంటే వెయ్యి 665.4డాలర్లు పెరిగింది. 

హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం కూడా పెరిగిన బంగారం 24 క్యారెట్ల ధర 10 గ్రాములకు మరో 270 రూపాయలు పెరిగింది. దీంతో 10 గ్రాములకు 44వేల 430 రూపాయల నుంచి 44వేల 700 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర అదే స్థాయిలో ఎగబాకింది. 10 గ్రాములకు 270 రూపాయలు పెరగడంతో 40వేల 730 రూపాయల నుంచి 41వేలకు రూపాయలకు పెరిగింది.

వెండి ధరలూ అదే స్థాయిలో పరుగులు తీస్తున్నాయి. మంగళవారం వెండి ధర కేజీకి ధర రూ.51వేల నుంచి రూ.51వేల 500 రూపాయలకు ఎగబాకింది. విజయవాడ, విశాఖపట్నంలలోనూ అదేవిధంగా ఉన్నాయి 24 క్యారెట్ ల బంగారం 44వేల 700 రూపాయలకు చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 41వేల రూపాయలు నమోదు చేశాయి.