స్వీట్ న్యూస్ : తగ్గుతున్న చమురు ధరలు

  • Published By: madhu ,Published On : January 2, 2019 / 02:10 AM IST
స్వీట్ న్యూస్ : తగ్గుతున్న చమురు ధరలు

ఢిల్లీ : కొత్త సంవత్సరంలో..చమురు ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ముడి చమురు ధరలు కిందకు దిగి వస్తుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది తొలి రోజున కూడా ధరలు తగ్గాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర 19 పైసలు తగ్గి రూ. 66.65గా ఉంది. ఇక లీటర్ డీజిల్ ధర 20 పైసలు తగ్గి…రూ. 62.66గా ఉంది. ముంబాయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 74.30 డీజిల్ ధర రూ. 65.56.., కోల్ కతాలో రూ. 70.78, డీజిల్ రూ. 64.42.., చెన్నైలో రూ. 71.23, డీజిల్ రూ. 66.15, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 72.82, డీజిల్ రూ. 68.11గా ఉంది. 
జనవరి 2వ తేదీన ధరలా ఇలా ఉన్నాయి. 
పెట్రోల్ : చెన్నై రూ. 71.22, ఢిల్లీ : 68.65, కోల్ కతా 70.78, ముంబై 74.30, ఆంధ్రప్రదేశ్ 85.81, తెలంగాణ 72.82. 
డీజిల్ : చెన్నై రూ. 66.14, ఢిల్లీ : 62.66, కోల్ కతా 64.42, ముంబై 65.56, ఆంధ్రప్రదేశ్ 78.56, తెలంగాణ 68.11.