దేశవ్యాప్తంగా డేటా సెంటర్ పార్కులు.. లక్ష డిజిటల్ గ్రామాలు : రూ.6 వేల కోట్లు కేటాయింపు

  • Published By: sreehari ,Published On : February 1, 2020 / 07:27 AM IST
దేశవ్యాప్తంగా డేటా సెంటర్ పార్కులు.. లక్ష డిజిటల్ గ్రామాలు : రూ.6 వేల కోట్లు కేటాయింపు

Updated On : February 1, 2020 / 7:27 AM IST

దేశంలో సాంకేతిక రంగంలో ట్రిలియన్ డాలర్ డిజిటల్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించడమే ధ్యేయంగా ప్రభుత్వం టెక్నాలజీ రంగంపై ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. 2020 కేంద్ర బడ్జెట్ లో టెక్నాలజీ రంగానికి చేయూతనిచ్చేలా లక్ష డిజిటల్ గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టవిటీని అందించడమే లక్ష్యంగా పెట్టుకోంది కేంద్రం.

దేశవ్యాప్తంగా డేటా సెంటర్ పార్కుల నిర్మాణానికి ఒక విధానాన్ని ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. డేటా సెంటర్ పార్కులతో పాటు లక్ష గ్రామ పంచాయతీలను డిజిటల్ విలేజ్ గా మారుస్తామని ఆమె చెప్పారు. సెల్ ఫోన్లు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీదారులకు ప్రత్యేక పథకం ప్రవేశపెడతామన్నారు. 9వేల కిలోమీటర్ల వరకు ఎకనామికల్ కారిడర్, ఎనలిటిక్స్, ఐఓటీ, ఏఐ సాంకేతిక అభివృద్ధితో ప్రపంచాన్నే మార్చేస్తుందన్నారు.

లక్ష గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ పైబర్ ద్వారా హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్టవిటీని అందిస్తామని ఆమె తెలిపారు. ఫైబర్ టూ హోం ద్వారా భారత్ నెట్ సౌకర్యంతో లక్ష గ్రామ పంచాయతీలకు ఆర్థిక సంవత్సరం 2020-21 నాటికి డిజిటల్ కనెక్టవిటీని కల్పిస్తామన్నారు. ఇందులో భారత నెట్ కోసం రూ.6వేల కోట్లు కేటాయించనున్నట్టు ఆమె తెలిపారు. అన్ని ప్రభుత్వ సంస్థల్లో గ్రామ పంచాయతీ స్థాయిలో డిజిటల్ కనెక్టవిటీ అందించేలా కృషి చేస్తామని నిర్మల స్పష్టం చేశారు.

కేంద్ర బడ్జెట్ 2020 – 21ను మంత్రి నిర్మల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 01వ తేదీ ఉదయం 11.00గంటలకు ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం నిర్మలా ఇది రెండోసారి. సామాన్యుల బడ్జెట్‌గా ఆమె అభివర్ణించారు. ఆర్థిక ప్రగతికి సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. ప్రజల ఆదాయం పెంచేందుకు సత్వరచర్యలు తీసుకుంటున్నట్లు, ప్రజల ఆదాయం పెంచడమే బడ్జెట్ లక్ష్యమన్నారు. స‌బ్‌కా సాత్‌, స‌బ్‌కా వికాస్ అన్న నినాదంతో ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం పనిచేస్తోందని..ఈ బడ్జెట్ ప్రతీ ఒక్కరికి మేలు చేసే విధంగా రూపొందించామని తెలిపారు.