డెబిట్ కార్డులున్నవారికి హెచ్చరిక..EMV లేకపోతే బ్లాక్

  • Published By: madhu ,Published On : December 30, 2019 / 06:14 AM IST
డెబిట్ కార్డులున్నవారికి హెచ్చరిక..EMV లేకపోతే బ్లాక్

Updated On : December 30, 2019 / 6:14 AM IST

మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో డెబిట్ కార్డులున్న వారికి ఇదొక హెచ్చరిక. EMV లేని డెబిట్ కార్డులను బ్లాక్ చేస్తున్నాయి. ATMల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకొనే సమయంలో సమస్యలు ఎదురవుతున్న దృష్ట్యా పలు బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డులపై జరుగుతున్న ఆన్ లైన్ మోసాలను దృష్టిలో పెట్టుకున్న RBI పలు నిర్ణయాలు తీసుకుంది.

అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు 2020, జనవరి 01వ తేదీ నుంచి ఇఎంవీ లేని డెబిట్ కార్డులను బ్లాక్ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. RBI మార్గదర్శకాల ప్రకారం..అన్ని భారతీయ బ్యాంకులు తమ వినియోగదారుల మాగ్నెటిక్ డెబిట్ కార్డులను కొత్త EMV కార్డుతో భర్తీ చేయాల్సి ఉంటుంది. మాగ్నెటిక్ డెబిట్ కార్డులను ఉపయోగిస్తున్న SBI, PNB, HDFC, ICICI బ్యాంకుతో పాటుగా మిగిలిన..బ్యాంకుల కస్టమర్లు మాగ్నెటిక్ డెబిట్ కార్డులను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. లేదంటే..డబ్బులు విత్ డ్రా చేసుకొనే సమస్యలు ఎదురు కావచ్చు. 

Read More : 13Th Day..రాజధానిలో ఆగని ఆందోళనలు