కరోనా కోసం ట్రంప్ రెండు మందులు వాడుతున్నారు. అవేంటో తెలుసా?

Trump coronavirus: కరోనా పాజిటీవ్ వచ్చిన Donald Trumpకి ఇంకా పరీక్షల్లోనే ఉన్న రెండు experimental drugs ఇచ్చారు. హాస్పటల్‌కెళ్లడానికి ముందే Regeneron తయారుచేస్తున్న యాంటీబాడీ డ్రగ్ ను ప్రెసిడెంట్ ట్రంప్‌కు అందించామని చెప్పారు వైట్ హౌస్ డాక్టర్లు. మిలిటరీ హాస్పటల్ లో remdesivir therapyని మొదలుపెట్టారు. Walter Reed Military Hospitalలో అలసట, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులు వచ్చినా, ట్రంప్ మాత్రం ఉల్లాసంగానే ఉన్నారు. యాక్టీవ్‌గా డాక్టర్లతో మాట్లాడుతున్నారు.
ఇంతకీ remdesivir, Regeneron’s మందుల ప్రభావం ఏంటి? వాటిని ఎందుకువాడతారంటే?
remdesivir అంటే ఏంటి?
ఎబోలా ట్రీట్‌మెంట్‌లో గొప్ప ఫలితాలను సాధించిన మందుది. ఇది యాంటీవైరల్ డ్రగ్. మరే ఇతర ట్రీట్‌మెంట్‌లోనూ ప్రపంచవ్యాప్తంగా ఈ డ్రగ్‌ను వాడటానికి అనుమతి లేదు. కాకపోతే ఈ డ్రగ్ కరోనా కట్టడికి
పనికివస్తుందనే తెలంగాణా, ఏపీలోకూ ఈ remdesivirమందును వాడుతున్నారు.
దీన్ని సిరల్లోకి ఎక్కిస్తారు. ఇది కోవిడ్‌కు కారణమైయ్యే SARS CoV-2 శరీరంలో పెరగకుండా అడ్డుకుంటుందన్నది నమ్మకం. దీన్ని వాడిన తర్వాత చాలామంది రోగులు వేగంగా కోలుకున్నారు.
కరోనాతో న్యూమోనియా తరహా రోగం కనిపించదని చైనాలో సైంటిస్ట్‌లు తేల్చిచెప్పగానే, వైరస్‌పై ప్రభావాన్ని అంచనావేయడానికి Gilead రెమిడిసివీర్‌ను చైనాకు పంపించింది.
రోగి శరీరంలోకి వెళ్లిన తర్వాత వైరస్ మల్టీపుల్ అయ్యే వ్యవస్థను Remdesivir దెబ్బతీస్తుంది. అలాగని అదెలా జరుగుతుందో మాత్రం సైంటిస్ట్‌లకు ఇంకా చిక్కలేదు. జనవరి నుంచి సాగిన అనేక
క్లినికల్ ట్రయిల్స్, లేబరోటరీ పరిశోధనల్లో చెప్పకోదగ్గ ఫలితాలే నమోదైయ్యాయి.
Lancet medical journalలో శనివారం పబ్లిష్ అయిన స్టడీలో remdesivir SARS CoV-2 వైరల్ లోడ్, మరణాలను తగ్గించడంలో ఎలాంటి ప్రభావం చూపించలేదని తేలింది.
ఏంటీ Regeneron treatment?
ఔషద ఉత్పత్తి సంస్థ Regeneron ఓ antibody treatment మీద ప్రయోగాలు చేస్తోంది. అంటే ఇంకా పూర్తిగా ఫలితాలు రాని చికిత్సా విధానం ఇది. ఇప్పుడు దీన్ని ట్రంప్ మీద ప్రయోగించారు.
ఇంకా పూర్తిస్థాయి పరిశోధనలు చేయాల్సి ఉంది. ఇదెలా పనిచేస్తుందంటే! ఈ యాంటీవైర్ యాంటీబాడీ “cocktail” వైరస్‌కున్న ప్రొటీన్‌ను గట్టిగా పట్టుకుంటుంది. దానివల్ల వైరస్ రోగి కణాలమీద దాడిచేయలేదు. అవికూడా రిప్లికేట్ అంటే, ప్రతిరూపాలను సృష్టించలేవు. ఈ సమయంలో రోగనిరోధక వ్యవస్థ వైరస్ మీద దాడిచేస్తుంది. ఒక విధంగా శరీరంలోకి వచ్చిన శత్రువును ఈ యాంటీబాడీ గట్టిగా పట్టుకొని, కదలనివ్వదు. ఈరోగా ఇమ్యునిటీ వాటిని ధ్వంసం చేస్తుంది.
Trumpకి 8g సింగిల్ డోస్ నిచ్చారు. కొన్నిరోజుల పాటు ఇంకొకటి ఇవ్వనక్కర్లేదంట.