FASTag KYC Deadline : ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ కొత్త డెడ్‌లైన్ ఇదే.. ఎలా అప్‌‌డేట్ చేయాలి? కేవైసీ స్టేటస్ చెకింగ్ ఎలా? పూర్తి వివరాలు మీకోసం..!

FASTag KYC Deadline : మీరు మీ ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ అప్‌డేట్ చేసుకున్నారా? వెంటనే ఈ తేదీలోగా కైవైసీని అప్‌డేట్ చేసుకోండి. లేదంటే మీ ఫాస్ట్ ట్యాగ్ అకౌంట్లు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం..

FASTag KYC Deadline : ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ కొత్త డెడ్‌లైన్ ఇదే.. ఎలా అప్‌‌డేట్ చేయాలి? కేవైసీ స్టేటస్ చెకింగ్ ఎలా? పూర్తి వివరాలు మీకోసం..!

FASTag KYC deadline is set to February 29_ How to update, check FASTag KYC status and other details

FASTag KYC Deadline : వాహనదారులకు గుడ్ న్యూస్.. ఫాస్ట్ ట్యాగ్ కేవైసీ గడువు తేదీని ఎన్‌హెచ్ఏఐ (NHAI) మరోసారి పొడిగించింది. ఇప్పటివరకూ ఉన్న ఒకటి కన్నా ఎక్కువ కార్ల కోసం ఒకే ఫాస్ట్‌ట్యాగ్‌ని ఉపయోగించడం లేదా ఒకే వాహనంతో బహుళ ఫాస్ట్‌ట్యాగ్‌లను లింక్ చేయడం కుదరదు. ఈ మేరకు ఎన్‌హెచ్ఏఐ ‘ఒక వాహనం, ఒక ఫాస్ట్‌ట్యాగ్’ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.

Read Also : Jio AirFiber Data Offer : జియో ఎయిర్‌ఫైబర్ యూజర్ల కోసం సరికొత్త 3 డేటా బూస్టర్ ప్లాన్లు ఇవే.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా తీసుకొచ్చింది. వాహనదారులు తమ ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. ప్రస్తుతం జనవరి 31వరకు ఉన్న గడువు తేదీని ఈ నెల (ఫిబ్రవరి) 29, 2024 వరకు పొడిగించింది. దీని గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని ఎలా అప్‌డేట్ చేయాలంటే? :

  • ఇప్పటికి కేవైసీ పూర్తిచేయని వారితో పాటు ప్రాథమికంగా కేవైసీ కాని (non-kyc) కస్టమర్ల కోసం..
  • https://fastag.ihmcl.com వెబ్‌సైట్‌ని సందర్శించి.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి. ఓటీపీ ఆధారిత ధ్రువీకరణను కూడా ఎంచుకోవచ్చు.
  • లాగిన్ అయిన తర్వాత డాష్‌బోర్డ్ మెనుకి నావిగేట్ చేయండి. డాష్‌బోర్డ్ ఎడమ వైపున ‘My Profile’ ఆప్షన్ ఎంచుకోండి. అది మిమ్మల్ని ‘My Profile’ పేజీకి రీడైరెక్ట్ చేస్తుంది.
  • ‘My Profile’ పేజీలో ‘Profile‘ సబ్ సెక్షన్ సమీపంలో ఉన్న ‘KYC’ సబ్ సెక్షన్ కనుగొని, దానిపై క్లిక్ చేయండి.
  • ‘KYC’ సబ్ సెక్షన్‌లో ‘Customer Type’ ఎంచుకోండి. ఆపై, అవసరమైన ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను సమర్పించడం ద్వారా తప్పనిసరి ఫీల్డ్‌లను పూర్తి చేయండి.
  • తప్పనిసరి డిక్లరేషన్‌ను టిక్ మార్క్ చేయండి.
    డిక్లరేషన్ : నేను/మేము అందించిన డాక్యుమెంట్లు అన్ని ప్రామాణికమైన పత్రాలు అని ధృవీకరించడమైనది. నేను/మా వద్ద అసలైనవి ఉన్నాయి.
    కేవైసీ ధృవీకరణ ప్రక్రియను కొనసాగించడానికి ఇది కీలకమని గమనించాలి.

నిర్దిష్ట బ్యాంక్ నుంచి ఫాస్ట్‌ట్యాగ్ జారీ అయిందా? కేవైసీని ఎలా అప్‌డేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం :

  • మీరు https://www.netc.org.in/request-for-netc-fastag వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • (NETC) ఫాస్ట్‌ట్యాగ్ కోసం అభ్యర్థన కింద మీ ఫాస్ట్‌ట్యాగ్ జారీచేసే బ్యాంకును ఎంచుకుని సందర్శించే వెబ్‌సైట్ లింక్‌పై క్లిక్ చేయండి.
  •  సంబంధిత ఫాస్ట్‌ట్యాగ్ జారీచేసే బ్యాంకుకు లాగిన్ చేయండి
  •  కేవైసీ ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయండి.
  • ఒకవేళ మీ బ్యాంక్ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేదా రిమైండర్‌ను అందుకోనట్లయితే.. మీ కేవైసీ పూర్తయిందని, మీ వైపు నుంచి ఎలాంటి చర్య అవసరం లేదని అర్థం.

మీరు ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీని ఎప్పుడు అప్‌డేట్ చేయాలి? :

FASTag KYC deadline is set to February 29_ How to update, check FASTag KYC status and other details

FASTag KYC deadline February 29

  • మీ పేపర్ వర్క్ అంతా కచ్చితంగా ఉంటే.. మీ కేవైసీ ఆమోదం పొందడానికి దాదాపు 7 పనిదినాలు పడుతుంది.
  • ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ (IHML) వెబ్‌సైట్‌లో షేర్ చేసిన వివరాల ప్రకారం.. కేవైసీ అప్‌గ్రేడ్ కోసం మీ అభ్యర్థనను సమర్పించిన తేదీ నుంచి గరిష్టంగా 7 పనిదినాలలో మీ కేవైసీ ప్రాసెస్ అవుతుంది.
  • కేవైసీ అభ్యర్థనను సమర్పించిన తర్వాత మీరు కస్టమర్ పోర్టల్‌లోని ‘My Profile’ పేజీలో మీ కేవైసీ స్టేటస్ చెక్ చేయవచ్చు.

ఫాస్ట్‌ట్యాగ్ కేవైసీ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?:

  • https://fastag.ihmcl.com వెబ్‌సైట్‌కు వెళ్లండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి లాగిన్ చేయండి. మీరు పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవచ్చు లేదా ఓటీపీ వెరిఫికేషన్ ఎంచుకోవచ్చు.

గమనిక : ఎన్‌హెచ్ఎఐ ఫాస్ట్‌ట్యాగ్ కోసం మీ నంబర్ రిజిస్టర్ కానట్లయితే.. రిజిస్టర్ కోసం (MyFASTag) యాప్‌ని ఉపయోగించాలి. బ్యాంక్ జారీ చేసిన ఫాస్ట్‌ట్యాగ్ పొందాలంటే.. మీ సంబంధిత బ్యాంక్ పోర్టల్‌ని సందర్శించి రిజిస్టర్ చేసుకోవాలి.

  • డ్యాష్‌బోర్డ్ మెనుకు నావిగేట్ చేయండి. ‘My Profile’ని ఎంచుకుని మీ కేవైసీ స్టేటస్ చెక్ చేసుకోండి.

Read Also : iQOO Neo 9 Pro Launch : అద్భుతమైన ఫీచర్లతో భారత్‌కు ఐక్యూ నియో 9 ప్రో వస్తోంది.. ప్రీ-ఆర్డర్ తేదీ వివరాలు వెల్లడి!