Fastrack Limitless FS1 : బ్లూటూత్ కాలింగ్, అలెక్సా సపోర్టుతో ఫాస్టాక్ లిమిట్‌లెస్ FS1 స్మార్ట్‌వాచ్.. ధర కేవలం రూ. 1995 మాత్రమే!
Fastrack Limitless FS1 : కొత్త స్మార్ట్‌వాచ్ కొనేందుకు చూస్తున్నారా? భారత మార్కెట్లోకి ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ FS1 అనే కొత్త స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. ఈ వాచ్ ధర కేవలం రూ. 1995 మాత్రమే.

Fastrack Limitless FS1 Smartwatch With Bluetooth Calling, Alexa Support Launched in India
Fastrack Limitless FS1 : భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్‌వాచ్ వచ్చేసింది. ప్రముఖ దేశీయ వేరబుల్ బ్రాండ్ (Fastrack Limitless) సరికొత్త సరసమైన స్మార్ట్‌వాచ్ లాంచ్ చేసింది. ఫాస్టాక్ లిమిట్‌లెస్ FS1 స్మార్ట్‌వాచ్ మోడల్ బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌తో పాటు అలెక్సా సపోర్టు కూడా కలిగి ఉంది. యూజర్లు తమ చేతి నుంచి నేరుగా వాయిస్ కాల్‌లను పొందవచ్చు. అలాగే కాల్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు.
ఈ ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ FS1 వాచ్.. 1.95-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. అడ్వాన్స్‌డ్ ATS చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ ఎంచుకోవడానికి 150 కన్నా ఎక్కువ వాచ్ ఫేస్‌లకు సపోర్టు ఇస్తుంది. ఇన్‌బిల్ట్ అమెజాన్ అలెక్సా (Amazon Alexa) సపోర్ట్‌తో వస్తుంది. ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ FS1 300mAh బ్యాటరీని కలిగి ఉంది. 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని పేర్కొంది.
భారత్‌లో ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ FS1 ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ FS1 ధర రూ. 1,995గా ఉంటుంది. స్పెషల్ లాంచ్ ధరపై ఎలాంటి వివరాలు లేవు. ఈ వాచ్ బ్లాక్, బ్లూ, పింక్ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది. ఏప్రిల్ 11 నుంచి అమెజాన్‌లో సేల్ అందుబాటులో ఉండనుంది.
Read Also : Best Smartwatches Offer : అమెజాన్‌లో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌లపై బెస్ట్ డీల్స్.. ఏ మోడల్ ధర ఎంతంటే?
ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ FS1 స్పెసిఫికేషన్‌లు :
ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ (FS1) పెద్ద డయల్‌ను కలిగి ఉంది. పెద్ద 1.95-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. హోరిజోన్ కర్వ్ డిస్‌ప్లేగా స్క్రీన్ 240×296 రిజల్యూషన్, 500నిట్స్ బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది. వేరబుల్ నావిగేషన్ సైడ్-మౌంటెడ్ బటన్‌ను కలిగి ఉంటుంది. స్మార్ట్‌వాచ్ యూజర్లు తమ వాచ్ నుంచి నేరుగా కాల్‌లను స్వీకరించవచ్చు. బ్లూటూత్ కాలింగ్‌కు సపోర్టు అందిస్తుంది.

Fastrack Limitless FS1 Smartwatch With Bluetooth Calling, Alexa Support Launched in India (Photo : Fastrack Limitless FS1)
ఫాస్ట్రాక్ అడ్వాన్స్‌డ్ ATS చిప్‌సెట్ లిమిట్‌లెస్ FS1 స్మార్ట్‌వాచ్‌కు పవర్ అందిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో హార్ట్ రేటు మానిటరింగ్‌కు సపోర్టుగా సెన్సార్లు ఉంటాయి. ఒత్తిడి, పీరియడ్స్, నిద్రను కూడా ట్రాక్ చేస్తుంది. అలాగే, వాకింగ్, రన్నింగ్ స్ప్రింటింగ్‌తో సహా 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్టు ఇస్తుంది. అమెజాన్ అలెక్సా (Amazon Alexa)కు కూడా సపోర్టు ఇస్తుంది. యూజర్లకు హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ అసిస్టెంట్ ఆప్షన్ కూడా అందిస్తోంది.
ఈ స్మార్ట్‌వాచ్ 150 కన్నా ఎక్కువ వాచ్ ఫేస్‌లను అందిస్తుంది. స్మార్ట్‌వాచ్‌లు Android లేదా iOS స్మార్ట్‌ఫోన్‌లలో (Fastrack Reflex World) యాప్ ద్వారా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ FS1 బ్లూటూత్ 5.3 కనెక్టివిటీని కలిగి ఉంది. ఇన్‌బిల్ట్ స్పీకర్లు, మైక్రోఫోన్‌లను కలిగి ఉండనుంది. ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ FS1 300mAh బ్యాటరీకి సపోర్టు అందిస్తుంది. బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 10 రోజుల వరకు వస్తుంది.