చెప్పి చెయ్యాలంతే : అప్పుడు ఆర్బీఐ..ఇప్పుడు సెబీ

ఇప్పటికే ఆర్బీఐకి కళ్లెం వేసిన కేంద్రం సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) అధికారాలకు కత్తెర వేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సెబీ ఏవైనా నిర్ణయాలు తీసుకొనే ముందు ఆ ప్రపోజల్స్ ను ఒక స్వతంత్ర కమిటీకి నివేదించాలని ఆర్థిక వ్యవహారాల విభాగం సూచించినట్లు సమాచారం. అయితే ఈ కమిటీలో బయటి వ్యక్తులు ఉంటారా లేక బోర్డు డైరక్టర్లు ఉంటారా అన్న విషయంపై మాత్రం ఇంకా సృషత రాలేదు.
ఒకవేళ ఆర్థికవ్యవహారాల విభాగం ఈ కమిటీ సభ్యులను నియమిస్తే ప్రభుత్వానికి సెబీపై మరింత పట్టు లభిస్తుంది. 25 ఏళ్లుగా సెబీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ కొత్త మార్పు కారణంగా సెబీ నిర్ణయాలకు జవాబుదారీ భాధ్యతలు పెరగనున్నాయి. భవిష్యత్తులో సెబీ చట్టానికి సవరణ కూడా చేసే అవకాశముంది.