Flipkart Big Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్.. మోటో జీ85, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఎప్పటినుంచంటే?
Flipkart Big Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఐఫోన్ 15 ప్లస్, మోటో జీ85 ఫోన్ మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లను అందించనుంది. సేల్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Flipkart Big Diwali Sale announced
Flipkart Big Diwali Sale : కొత్త ఫోన్ కొంటున్నారా? ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌ను ప్రకటించింది. ఈ ప్లాట్‌ఫారమ్ ఇటీవల 2 బిగ్ ఫెస్టివల్ సేల్ నిర్వహించగా.. ఇప్పుడు మరొక సేల్ ఈవెంట్‌ను హోస్ట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 21న ప్రారంభం కానుంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌లు అక్టోబర్ 20న ఒక రోజు ముందుగానే యాక్సెస్ చేయొచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్ గత సేల్ ఈవెంట్‌ల మాదిరిగానే ఆఫర్‌లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ సమయంలో లభించే అన్ని డీల్స్ కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
అయితే, వినియోగదారులు ఐఫోన్ 15 ప్లస్, మోటో జీ85 ఫోన్ మరిన్ని స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్‌లను అందించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో మోటోరోలా మోటో ఎడ్జ్ 50ప్రో ఫోన్ రూ. 29,999కి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 35,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్ రూ. 6వేలతగ్గింపును అందిస్తోంది. మోటో ఎడ్జ్ 50ప్రో ధర రూ.30వేల లోపు తగ్గుతుంది. మరిన్ని ఆఫర్‌లతో మోటోరోలా ఫోన్ ధర రూ.27,999 వరకు తగ్గించుకోవచ్చు. ఇతర ఫోన్లలో మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ధర రూ. 21,999 కాగా, మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ ధర రూ. 23,999కు అందించనుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ సందర్భంగా మోటో జీ85 స్మార్ట్‌ఫోన్ ధర రూ.16,999కి అందుబాటులో ఉంటుంది. మోటో జీ45 ఫోన్ ధర రూ.9,999కి తగ్గుతుంది. వినియోగదారులు మరింత తక్కువ ధరకు పొందాలంటే.. కొన్ని బ్యాంక్ కార్డ్ ఆఫర్లను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ సమయంలో కొత్త మోటోరోలా ఫోన్‌లు తక్కువ ధరకే అమ్మకానికి రానున్నాయి. ఏయే డీల్స్ అందుబాటులో ఉంటాయో వెల్లడించలేదు. అయితే ఇటీవలి ఫెస్టివల్ సేల్ మాదిరిగానే పోకో ఎఫ్6, పోకో ఎక్స్6 ప్రో, ఫోల్డబుల్స్, వన్‌ప్లస్ 12, శాంసంగ్ గెలాక్సీ ఎస్24, ఐఫోన్ 15, ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ 14 మరిన్నింటిపై డిస్కౌంట్లను అందించవచ్చు.
ప్రస్తుతానికి, ఈ సేల్ ఎప్పుడు ముగియనుందో ఎలాంటి సమాచారం లేదు. అయితే, ఈ సంవత్సరంలో ఫ్లిప్‌కార్ట్ చివరి ఫెస్టివల్ సేల్ కావచ్చు. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఫ్లిప్‌కార్ట్ మరో సేల్ ఉంటుందని అంచనా. సాధారణంగా జనవరి రెండో వారంలో సేల్ ఉండవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 16పై బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్‌ను అందించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. కొత్త ఐఫోన్‌లను లాంచ్ చేసిన 4 నెలల తర్వాత ఆపిల్ పాత మోడళ్లపై ధర తగ్గింపు అందిస్తుంటుంది.