Gold: బంగారం దూకుడు.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇలా..
బంగారం ధర దూకుడు కొనసాగుతూనే ఉంది. తద్వారా ఇంతకుముందెన్నడూ చూడని స్థాయికి చేరింది.

Gold rate
Gold Price: బంగారం ధర దూకుడు కొనసాగుతూనే ఉంది. తద్వారా ఇంతకుముందెన్నడూ చూడని స్థాయికి చేరింది. ఈవారంలో తొలిసారిగా బంగారం ఫ్యూచర్స్ ట్రాయ్ ఔన్స్ (31.1 గ్రాములు) 3వేల డాలర్లు దాటింది. అంతర్జాతీయ మార్కెట్ లలో అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాలు అంతర్జాతీయయ వాణిజ్య యుద్ధానికి తెరలేపాయి. దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే రాబోయే కొద్ది నెలలు బంగారం ధర పెరుగుతూనే ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం బంగారంపై పెట్టుబడి పెట్టడమే సురక్షిత మార్గంగా అధికశాతం మంది పెట్టుబడిదారులు భావిస్తున్నారు. అయితే, కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. బంగారం ఎల్లప్పుడూ ద్రవ్యోల్బణ హెడ్జ్ కాదని పేర్కొంటున్నారు. బంగారంలో పెట్టుబడి పెట్టడం పట్ల జాగ్రత్తగా ఉండాలని కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడ్ కమిషన్ కూడా గతంలో హెచ్చరించింది.
ఈరోజు బంగారం ధరలు..
అంతర్జాతీయ మార్కెట్ లో ప్రస్తుతం ఔన్సు బంగారం 2,986 డాలర్ల వద్ద కొనసాగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.82,200 కాగా.. 24 క్యారట్ల ధర రూ.89,670 వద్ద కొనసాగుతుంది.
దేశం రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,350 కాగా.. 24 క్యారట్ల ధర రూ.89,820 వద్ద కొనసాగుతుంది.
ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ. 82,200 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.89,670 వద్ద కొనసాగుతుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం తదితర ప్రాంతాల్లో కిలో వెండి రేటు రూ.1,12,000 వద్ద కొనసాగుతుంది.
ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,03,000 కాగా.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,12,000 వద్ద కొనసాగుతుంది.