Gold Price Today : దిగొస్తున్న బంగారం ధర.. వరుసగా నాల్గోరోజు తగ్గిన గోల్డ్ రేటు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం కూడా బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ..
![Gold Price Today : దిగొస్తున్న బంగారం ధర.. వరుసగా నాల్గోరోజు తగ్గిన గోల్డ్ రేటు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే? Gold Price Today : దిగొస్తున్న బంగారం ధర.. వరుసగా నాల్గోరోజు తగ్గిన గోల్డ్ రేటు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?](https://10tv.in/wp-content/uploads/2024/07/Gold-And-Silver-Price-Today-11.jpg)
Gold And Silver Price Today
Gold and Silver Price Today : బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. వెయ్యికిపైగా తగ్గుదల చోటు చేసుకుంది. మరోవైపు కిలో వెండిపై రూ. 4,500పైగా తగ్గింది. తాజాగా ఇవాళ కూడా బంగారం ధర తగ్గగా.. వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం కూడా బంగారం ధర తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 22క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,700 కాగా.. 10గ్రాముల 24క్యారట్ల గోల్డ్ ధర రూ.73,850. - దేశంలోని ప్రధాన నగరాల్లో ..
దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.67,850 కాగా, 24క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 74,000.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో.. 22క్యారట్ల 10గ్రాముల గోల్డ్ ధర రూ.67,700 కాగా, 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 73,850.
చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,250 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ ధర రూ. 74,450కు చేరింది.
- వెండి ధర ఇలా ..
దేశ వ్యాప్తంగా సోమవారం వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 96,000.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలను పరిశీలిస్తే..
చెన్నైలో కిలో వెండి ధర రూ.96,000.
కోల్ కతాలో కిలో వెండి ధర రూ. 91,500 వద్ద కొనసాగుతుంది.
ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో కిలో వెండి ధర రూ.93,150.
బెంగళూరులో కిలో వెండి ధర రూ. 91,500 వద్ద కొనసాగుతుంది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 10 గంటలకు నమోదైనవి. ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.