Gold Price Today: షాకిచ్చిన బంగారం, ఊరటనిచ్చిన వెండి.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం స్వల్పంగా పెరిగింది. అదే వెండి ధర భారీగా తగ్గింది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో బంగారం, వెండి ధరలను పరిశీలిస్తే..

Gold Price Today: షాకిచ్చిన బంగారం, ఊరటనిచ్చిన వెండి.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated On : December 8, 2023 / 9:06 AM IST

Today Gold and Silver Rate: బంగారం ఆభరణాలుగానే కాదు పెట్టుబడిగా కూడా ఉపయోగిస్తుంటారు భారతీయులు. ధరలు తగ్గినప్పుడు కొని పెరిగినప్పుడు అమ్ముతుంటారు. ఇలా బంగారం పెట్టుబడిగా ఉపయోగిస్తున్నారు. కొనాలనుకునే క్రమంలో బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా..? అని ఎదురు చూస్తుంటారు. కానీ ఈరోజు అంటే శుక్రవారం పసిడి ప్రియులకు బంగారం ధరలు కాస్త షాకిచ్చాయనే చెప్పాలి. ఎందుకంటే బంగారం ధర కాస్త పెరిగింది. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తోంది. నిన్నటికంటే బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల బంగారంపై రూ.100 పెరిగింది.

బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు నిన్నటి కంటే కాస్త పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 100 పెరిగింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.110 పెరిగింది. పెరిగిన ధరతో చూసుకుంటే గురువారం 10గ్రాముల బంగారం రూ. 57,450 కాగా..శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.57,550కి పెరిగింది. అదే 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర నిన్న రూ. గోల్డ్ రూ. 62,670 ఉంటే శుక్రవారం రూ.62,780కి చేరింది.

తెలుగు రాష్ట్రాల్లో..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ. 57,750 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 62,780 కు చేరింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,700 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 62,930.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,780కు చేరింది.
– చెన్నైలో 10 గ్రాముల గోల్డ్ పై రూ. 350 తగ్గింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,200 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.63,490కు చేరింది.

తగ్గిన వెండి ధర ..
నిన్నటితో పోలిస్తే బంగారం ధర కాస్త పెరిగితే వెండి ధర కాస్త తగ్గింది. కిలో వెండికి రూ.1000లు తగ్గింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో వెండి ధర తగ్గింది. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. గురువారం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 81,000లు ఉంటే ఈరోజు కిలో వెండిపై రూ.1000లు తగ్గి రూ.80,000లుగా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర ఇంకా తగ్గి రూ.80,000లుగా ఉంది. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.77,200 కు చేరింది. బెంగళూరులో కిలో వెండి ధర మరింతగా తగ్గి రూ. 76,500లుగా ఉంది.