Gold Silver Price Today : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం గోల్డ్ ఎంతంటే?
Gold and Silver Rates Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే, ఇవాళ గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా తగ్గాయి.

Gold Silver Price Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ఇవాళ గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా తగ్గాయి.

మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 450 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1550 తగ్గింది. అంతర్జాతీయంగానూ బంగారం ధర తగ్గింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ ధర 4,046 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండిపై రూ. 5వేలు తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,44,170 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,32,150 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,44,320 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,32,300 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,44,170కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,32,150 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,35,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,35,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,35,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు
