Gold price outlook: చైనా సుంకాల ప్రభావం.. బంగారం ధరలు భారీగా తగ్గుతాయా?

ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమాడటీ అండ్ కరెన్సీ వీపీ రీసెర్చ్ జేటీన్ ట్రివెడీ ఇదే విషయాన్ని తెలిపారు.

Gold price outlook: చైనా సుంకాల ప్రభావం.. బంగారం ధరలు భారీగా తగ్గుతాయా?

Updated On : April 6, 2025 / 3:17 PM IST

అమెరికా విధించిన సుంకాలకు ప్రతిగా ఆ దేశంపై చైనా కూడా అదనపు టారిఫ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రభావం బంగారం ధరలపై కూడా పడుతోంది. తాజాగా, గోల్డ్ ఫ్యూచర్ 2025 జూన్ కాంట్రాక్ట్‌ రూ.88,130 వద్ద క్లోజ్ అయింది. అంటే పెట్టుబడిదారులు ఈ ఏడాదిలో జూన్‌లో ఆ ధర వద్ద బంగారాన్ని కొనడం లేదా విక్రయించే వీలు ఉంటుంది.

దీంతో ధరలు తగ్గినట్లే భావించాలి. చాలా మంది పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించడానికి బంగారాన్ని విక్రయించడంపైనే దృష్టిపెట్టారు. అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలే దీనికి కారణం. ఈ తీరును మార్కెట్లను అస్థిరంగా చేస్తుంది.

చైనా అదనపు సుంకాలు విధించిన తర్వాత బంగారం ధరలు 2.17 శాతం తగ్గి 10 గ్రాముల బంగారం ధర రూ.88,099కి చేరుకుంది. అంతకుముందు కమాడటీ మార్కెట్‌ క్లోజ్‌ అయ్యే సమయానికి ఈ ధర రూ.90,057గా ఉంది.

Also Read: అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం.. వీడియో వైరల్

చైనా అదనపు సుంకాలు విధించిన గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర 2.4 తగ్గి ఔన్సుకు $3,041.11గా కొనసాగింది. స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయిన నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం అమ్మకాలు జరిపి, లాభాల స్వీకరణకు మొగ్గుచూపడమే ఇందుకు కారణం.

కమాడటీ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతానికైతే దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం మరీ ఎక్కువగా లేదు. దీంతో బంగారం ధరలు తగ్గుతూ ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రపంచ రాజకీయ, భౌగోళిక పరిస్థితులు ప్రశాంతంగా ఉన్న సమయంలో ప్రజలు సాధారణంగా బంగారాన్ని అధికంగా కొనే అవకాశం ఉండదు. దీంతో ధరలు తగ్గుతాయి.

ఎల్‌కేపీ సెక్యూరిటీస్ కమాడటీ అండ్ కరెన్సీ వీపీ రీసెర్చ్ జేటీన్ ట్రివెడీ ఇదే విషయాన్ని తెలిపారు. చైనా అదనపు టారిఫ్ ప్రకటనల తరువాత బంగారం పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారని అన్నారు. గత కొన్ని నెలలుగా పెట్టుబడిదారులు వాణిజ్య యుద్ధం మరింత పెరుగుతుందని భావిస్తూ బంగారాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయని భావిస్తూ అమ్మకాలపై దృష్టి పెట్టారని అన్నారు.