Gold-Silver Prices Drop : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?
బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం దిగొచ్చింది.. అలాగే వెండి ధరలు కూడా దిగొచ్చాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు గురువారం (జూలై 8)న భారీగా తగ్గాయి.

Gold Price Today Sees Huge Drop, Down Over Rs 8,000 From Record High
Gold-Silver Prices Drop : బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం దిగొచ్చింది.. అలాగే వెండి ధరలు కూడా దిగొచ్చాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు గురువారం (జూలై 8)న భారీగా తగ్గాయి. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ ((MCX)లో ఆగస్టు గోల్డ్ కాంట్రాక్ట్స్ ఈ రోజు ఉదయం పసిడి ధర 10 గ్రాములకు 0.28 శాతం తగ్గి రూ .47,776కు చేరుకుంది. సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ 0.52 శాతం పెరిగి వెండి కిలో గ్రాముకు రూ.69,000 వద్ద ట్రేడవుతున్నాయి. MCXలో 2020 ఆగస్టులో బంగారం ధర 56,191 రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం బంగారం ధరలు 10 గ్రాములకు సుమారు రూ. 47,650లకు అమ్ముడవుతున్నాయి. బంగారం రికార్డు స్థాయిల నుంచి రూ.8వేలకు తగ్గి చౌకగా అమ్ముడవుతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ బలపడటంతో బంగారం ధరలు గురువారం స్థిరంగా ఉన్నాయి. దాంతో బంగారం ధరల్లో కొద్దిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక ఔన్సుకు 1,803.01 డాలర్లగా ఉంది. ఇక యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా ఒక ఔన్సుకు 0.1శాతం అంచున అధికంగా 1,804.30 డాలర్లకు ఎగసింది. ఫిబ్రవరి 19 నుంచి బెంచ్ మార్క్ యూఎస్ 10ఏళ్ల ఖజానా కనిష్ట స్థాయికి పడిపోయింది. మరోవైపు కరోనా డెల్టా వేరియంట్ల వ్యాప్తితో కేసులు పెరగడం వంటి ఆందోళనల నేపథ్యంలో స్థిరంగా బంగారం ధరలు కొనసాగుతున్నాయి. ఏసియన్ ట్రేడ్ లో గురువారం ఉదయం అంతర్జాతీయ బంగారం, వెండి ధరలు బలహీనంగా ప్రారంభమయ్యాయి.
గత కొద్ది రోజులుగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. మల్టీ కమోడిటీస్ ఎక్స్ఛేంజ్‌లో బంగారు సెప్టెంబర్ ఫ్యూచర్స్ బుధవారం ముగింపు ధర కంటే 10 గ్రాములకు రూ .47,674 వద్ద రూ.236 చౌకగా ట్రేడ్ అవుతున్నాయి. కొనుగోలుదారులకు ఒక సువర్ణావకాశంగా చెప్పవచ్చు. రాబోయే వారాల్లో, బంగారం ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. అందుకే బంగారంతో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కావొచ్చు.. COVID-19 మహమ్మారి సమయంలో ఆర్థిక మాంద్యం భయంతో స్టాక్ మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలాయి. ఆ సమయంలో పెట్టుబడిదారులు బంగారంపై భారీగా పెట్టుబడులు పెట్టారు. ఫలితంగా బంగారం ధరలు వారి జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.