రేట్ తగ్గింది: బంగారం కొనడానికి అనువైన సమయమిదే

పసిడి ధర పతనం మరో రోజుకు కొనసాగింది. హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం 22 కార్యెట్ల బంగారం 10గ్రాములకు కూడా రూ.30కు పడిపోయింది. దీంతో రూ.35వేల 910గా నిలిచింది. బంగారంతో పాటు వెండి అదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.90 దిగొచ్చింది. ఫలితంగా వెండి ధర రూ.47,400కు తగ్గింది.
అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం రూ.40 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.39,170కు పడిపోయింది. అంతర్జాతీయంగా ట్రెండ్ బలహీనం కావడంతో పాటు దేశీ జ్యూవెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ తగ్గిపోవడమే కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలో ఎటువంటి మార్పులేదు. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రూ.37వేల 900గానే ఉంది. 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.36,700 వద్దనే నిలకడగా ఉంది. వెండి ధరలో పతనం కనిపిస్తుంది. కేజీకి రూ.90 తగ్గి రూ.47వేల 400కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఔన్స్‌కు 0.02 శాతం తగ్గడంతో 1,478.95 డాలర్లకు క్షీణించింది. వెండి ధరలో కాస్త పెరుగుదల కనిపిస్తుంది. ఔన్స్‌కు 0.02 శాతం పెరిగి 16.92 డాలర్లకు ఎగబాకింది. డిసెంబర్ 15 నుంచి చైనా దిగుమతులపై అమెరికా కొత్త టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి. అలా జరిగితే బంగారం ధర పెరిగే అవకాశాలు లేకపోలేదు.