Top 5 Smartphones 2023 : 2023లో టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవేనట.. గూగుల్ బార్డ్ ఏఐ టక్కున చెప్పేసింది..!

Top 5 Smartphones 2023 : ప్రపంచవ్యాప్తంగా మొబైల్ మార్కెట్లో అనేక సరికొత్త స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అన్నింటిలో ఏ ఫోన్ బెటర్ అంటే చెప్పడం కష్టమే. గూగుల్ బార్డ్ ఏఐని అడిగితే ఏం చెప్పిందో తెలుసా?

Top 5 Smartphones 2023 : 2023లో టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవేనట.. గూగుల్ బార్డ్ ఏఐ టక్కున చెప్పేసింది..!

Google Bard suggests us the ‘Top 5 smartphones of 2023’, Includes two Samsung devices

Top 5 Smartphones 2023 : 2023 ఏడాదిలో అందుబాటులో ఉన్న ‘టాప్ స్మార్ట్‌ఫోన్‌ల’ కోసం తెగ సెర్చ్ చేసేస్తుంటారు. అయితే, ఏ ఫోన్ కొంటే బెటర్ అనేది చెప్పడం కష్టమే. ఈ విషయంలో చాలామంది కొనుగోదారులు హైరానా పడుతుంటారు. స్మార్ట్‌ఫోన్లలో ఏ బ్రాండ్ బెస్ట్ అనేది తేల్చుకోలేక టెక్ బ్లాగుల రివ్యూలపై ఆధారపడుతుంటారు. ఇదే విషయంలో గూగుల్ బార్డ్ ఏఐ (Google Bard AI)ని 2023లో టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఏంటి? అని అడిగితే ఏం చెప్పిందో తెలుసా? టక్కున బార్డ్ ఏఐ ఈ టాప్ స్మార్ట్ ఫోన్లను సూచించింది. బార్డ్ AI ప్రకారం.. 2023 మధ్యకాలం వరకు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు ఈ కింది విధంగా ఉన్నాయి.

* Samsung Galaxy S23 Ultra
* Apple iPhone 14 Pro
* Google Pixel 7 Pro
* OnePlus 11
* Samsung Galaxy Z Fold 4

ఇదే విషయమై ఓపెన్ఏఐ (ChatGPT)ని కూడా అడగవచ్చు. కానీ, దీని డేటాబేస్ సెప్టెంబర్ 2021 వరకు మాత్రమే ఉంది. అయితే, (Google Bard AI) లేటెస్ట్ టెక్నాలజీ బాగా అప్‌డేట్ అయింది. ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లను ఇట్టే సూచించగలదు. పైన పేర్కొన్న స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లను ఓసారి పరిశీలిద్దాం..

Read Also : Apple iPhone 14 Series : ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్.. ఇందులో ఏ ఐఫోన్ కొంటే బెస్ట్ అంటే? ఇప్పుడే తెలుసుకోండి..!

Samsung Galaxy S23 Ultra :
గెలాక్సీ S23 Ultra, LTPO స్క్రీన్‌తో పాటు 6.8-అంగుళాల AMOLED డిస్‌ప్లే (3088 x 1440)ని అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇన్ఫినిటీ O డిస్‌ప్లేను అందిస్తుంది. ఎక్కువ స్క్రీన్-టు-బాడీ నిష్పత్తిని కలిగి ఉంది. రెండు డివైజ్‌లలో రిఫ్రెష్ రేట్ 120Hz వరకు ఉంటుంది. ఈ డివైజ్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ను (200MP + 12MP + 10MP+10MP) అందిస్తుంది. ఫ్రంట్ కెమెరా 12MP సెన్సార్‌ను అందిస్తుంది. Qualcomm Snapdragon 8 Gen 2 చిప్‌సెట్ డివైజ్‌కు పవర్ అందిస్తుంది.

Apple iPhone 14 Pro :
ఈ ఆపిల్ డివైజ్ A16 బయోనిక్ చిప్‌సెట్‌తో పాటు 6.1 సూపర్ రెటినా XDR డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ డివైజ్ ప్రైమరీ కెమెరా 48MP ఉండగా, ఫ్రంట్ కెమెరా 12MPతో వచ్చింది.

Google Bard suggests us the ‘Top 5 smartphones of 2023’, Includes two Samsung devices

Google Bard suggests us the ‘Top 5 smartphones of 2023’, Includes two Samsung devices

Google Pixel 7 Pro :
గూగుల్ పిక్సెల్ 7 Pro ముఖ్య ఫీచర్లలో ఆండ్రాయిడ్ 13, 12 GB RAM + 128 GB ROM, 17.02 cm (6.7 inch) Quad HD+ డిస్‌ప్లే (3120 x 1440 పిక్సెల్‌లు), 50MP + 48MP + 12MP బ్యాక్ కెమెరా సెటప్, 10.8MP ఫ్రంట్ కెమెరా, 4926mAh బ్యాటరీ, Google Tensor G2 ప్రాసెసర్ మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి.

OnePlus 11 :
ఈ వన్‌ప్లస్ డివైజ్ 3216x 1440 పిక్సెల్స్ AMOLED LTPO 3.0 స్క్రీన్, 1440p రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల AMOLED స్క్రీన్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రిఫ్రెష్ రేట్ 120Hz కలిగి ఉంది. ప్రాసెసర్ విషయానికి వస్తే.. డివైజ్ సరికొత్త Qualcomm Snapdragon 8 Gen 2 ద్వారా పవర్ అందిస్తుంది. ఈ వన్‌ప్లస్ బ్యాక్ కెమెరా సెటప్ 50MP + 48MP + 32MPతో వచ్చింది. ఈ ఫోన్ ఫ్రంట్ కెమెరా 16MPతో వచ్చింది.

Samsung Galaxy Z Fold 4 :
మీరు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఇష్టపడే వారైతే.. శాంసంగ్ గెలాక్సీ Z Fold 4 బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ డివైజ్ ప్రధాన డిస్ప్లే 7.6 అంగుళాలు అయితే, ఇతర డిస్ప్లే 6.2 అంగుళాలు కలిగి ఉన్నాయి. బ్యాక్ కెమెరా సెటప్‌లో 50MP + 12MP + 10MP ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ Android 12L ఆధారిత One UI 4.1ని పొందుతుంది.

Read Also : Apple iPhone 11 Sale : అత్యంత సరసమైన ధరకే ఆపిల్ ఐఫోన్ 11.. కేవలం రూ. 8,950కే సొంతం చేసుకోవచ్చు.. డోంట్ మిస్!