Google Pixel 8a : బిగ్ డిస్కౌంట్ భయ్యా.. భారీగా తగ్గిన గూగుల్ పిక్సెల్ 8a ఫోన్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!
Google Pixel 8a : గూగుల్ పిక్సెల్ 8a ధర భారీగా తగ్గింది. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 20వేల లోపు ధరలోనే కొనేసుకోవచ్చు.

Google Pixel 8a
Google Pixel 8a : పిక్సెల్ అభిమానులకు గుడ్ న్యూస్.. గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్‌ఫోన్ పై దిమ్మతిరిగే ఆఫర్.. కొనాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి.. గూగుల్ స్మార్ట్‌ఫోన్లు (Google Pixel 8a) అద్భుతమైన ఫీచర్లతో ప్రీమియం కేటగిరీలో అందుబాటులో ఉన్నాయి. బేస్ ఆండ్రాయిడ్ ఫోన్ల కన్నా చాలా బెటర్ ఫీచర్లు ఉంటాయి.
గూగుల్ పిక్సెల్ ఫోన్లు ఖరీదైనవి అయినా ఇప్పుడు పిక్సెల్ 8 సిరీస్ కేవలం రూ. 20వేల లోపు ధరలోనే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్ గూగుల్ పిక్సెల్ 8aపై అద్భుతమైన డీల్ ఆఫర్ చేస్తోంది. ఫోటోగ్రఫీ లేదా సెల్ఫీలపై ఆసక్తి ఉన్నవారికి ఇదే బెస్ట్ ఫోన్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి..
గూగుల్ పిక్సెల్ 8a డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్ పిక్సెల్ 8a ధర రూ.52,999కు లిస్ట్ కాగా, 28 శాతం తగ్గింపుతో అందిస్తోంది. కేవలం రూ.37,999కే పొందవచ్చు. అదనంగా, HDFC బ్యాంక్ కార్డ్ EMI పేమెంట్లతో రూ.7వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
ఇంకా, ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. కొనుగోలుపై రూ.37వేల వరకు తగ్గింపు పొందవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ వాల్యూ రూ.11వేలు ఉంటే.. రూ.20వేల కన్నా తగ్గింపు ధరకే పిక్సెల్ 8a ఫోన్ ఇంటికి తెచ్చుకోవచ్చు.
గూగుల్ పిక్సెల్ 8a స్పెసిఫికేషన్లు :
గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ అల్యూమినియం ఫ్రేమ్‌తో ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్ కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. బాక్స్ వెలుపల ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది.
హుడ్ కింద, గూగుల్ టెన్సర్ G3 ద్వారా పవర్ అందుతుంది. 8GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీ కలిగి ఉంది. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం, గూగుల్ పిక్సెల్ 8a ఫోన్ 64MP+ 13MP కాన్ఫిగరేషన్ డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.