Harley Davidson X440 Bookings : ఆగస్టు 3 వరకు హార్లే-డేవిడ్‌సన్ X440 ఆన్‌లైన్ బుకింగ్స్.. డెలివరీలు ఎప్పటినుంచంటే? ఇప్పుడే బుక్ చేసుకోండి!
Harley Davidson X440 Bookings : హార్లే-డేవిడ్‌సన్ X440 ఆన్‌లైన్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఆగస్టు 3 వరకు ఛాన్స్ ఉంది. డెలివరీలు ఎప్పటినుంచో తెలుసా?

Harley-Davidson X440 online booking to close on August 3, deliveries to start in October
Harley Davidson X440 Bookings : ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్‌తో కలిసి అభివృద్ధి చేసిన హార్లే-డేవిడ్‌సన్ X440 బైక్ ఆన్‌లైన్ బుకింగ్‌లు మొదలయ్యాయి. వచ్చే అక్టోబర్‌లో Harley-Davidson X440 రాజస్థాన్‌లోని హీరో మోటోకార్ప్ నీమ్రానా ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేస్తుంది. మోటార్‌సైకిల్ బుకింగ్ తేదీల ప్రకారం.. ప్రాధాన్యతా ప్రాతిపదికన కస్టమర్‌లకు డెలివరీ చేయనుంది. డిమాండ్ ట్రెండ్‌లకు ప్రతిస్పందనగా ఉత్పత్తి సామర్థ్యం పెంచనుంది.
ఆన్‌లైన్ బుకింగ్‌ల పునఃప్రారంభ తేదీ, తదుపరి విండో ధర తర్వాత ప్రకటించనుందని హీరో మోటోకార్ప్ అధికారిక ప్రకటనలో తెలిపింది. Harley-Davidson X440తో హీరో మోటోకార్ప్, దిగ్గజ అమెరికన్ బ్రాండ్ భారత్‌లో మొదటిసారిగా 440cc సెగ్మెంట్‌లోకి ప్రవేశించాయి. Harley-Davidson X440 బైక్ 3 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. డెనిమ్, వివిడ్ S కింద వేరియంట్ వారీగా హార్లే-డేవిడ్‌సన్ X440 ధరలు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.

Harley Davidson X440 booking to close on August 3, deliveries to start in October
* Harley-Davidson X440 Denim : రూ. 2.29 లక్షలు
* Harley-Davidson X440 Vivid : రూ. 2.49 లక్షలు
* Harley-Davidson X440 S : రూ. 2.69 లక్షలు
ఈ మోటార్‌సైకిల్ 440cc, సింగిల్-సిలిండర్, 2-వాల్వ్, ఆయిల్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగిస్తుంది. 27bhp గరిష్ట శక్తిని, 38Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. బైక్‌కు అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ కూడా ఉన్నాయి.