VIDA EV: మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసిన హీరో మోటోకార్ప్‌

రెండు వేరియంట్లలో ఈ స్కూటర్‌ను తీసుకొచ్చారు. విడా వీ1 ప్లస్‌, విడా వీ1 ప్రో పేరిట వీటిని విడుదల చేశారు. వీ1 ప్లస్‌ ధరను రూ.1.45 లక్షలుగానూ, వీ1 ప్రో ధరను రూ.1.59 లక్షలుగానూ నిర్ణయించారు. సింగిల్‌ ఛార్జ్‌తో విడా వీ1 మోడల్‌ 143 కిలోమీటర్ల రేంజ్‌ ప్రయాణిస్తుంది. విడా ప్రో మోడల్‌ 165 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. రిమూవబుల్‌ బ్యాటరీ, పోర్టబుల్‌ ఛార్జర్‌తో ఈ బైక్‌ వస్తోంది

VIDA EV: మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసిన హీరో మోటోకార్ప్‌

Heros first electric scooter Vida V1 launched in India

Updated On : October 7, 2022 / 6:21 PM IST

VIDA EV: ప్రస్తుతం వాహన రంగం మొత్తం సంప్రదాయ ఇంధనానికి స్వస్తి చెప్పి విద్యుదీకరణ వైపుకు మారుతోంది. దీనికి అనుగుణంగా వాహన తయారీ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ తయారీ వైపుకు మళ్లుతున్నారు. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఈ యుగం ఊపందుకుంటోంది. రాబోయే రోజులను తమకు అనుగుణంగా మలుచుకునేందుకు అన్ని కంపెనీలు పోటీ పడుతున్నాయి. తమ నూతన ఉత్పత్తులను మార్కెట్లో విడుదల చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్‌ విద్యుత్‌ వాహన రంగంలోకి అడుగు పెట్టింది. విడా వీ1 పేరిట తొలి విద్యుత్‌ స్కూటర్‌ను శుక్రవారం లాంచ్‌ చేసింది.


రెండు వేరియంట్లలో ఈ స్కూటర్‌ను తీసుకొచ్చారు. విడా వీ1 ప్లస్‌, విడా వీ1 ప్రో పేరిట వీటిని విడుదల చేశారు. వీ1 ప్లస్‌ ధరను రూ.1.45 లక్షలుగానూ, వీ1 ప్రో ధరను రూ.1.59 లక్షలుగానూ నిర్ణయించారు. సింగిల్‌ ఛార్జ్‌తో విడా వీ1 మోడల్‌ 143 కిలోమీటర్ల రేంజ్‌ ప్రయాణిస్తుంది. విడా ప్రో మోడల్‌ 165 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. రిమూవబుల్‌ బ్యాటరీ, పోర్టబుల్‌ ఛార్జర్‌తో ఈ బైక్‌ వస్తోంది. అక్టోబర్‌ 10 నుంచి ఈ స్కూటర్‌ బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ రెండో వారం నుంచి డెలివరీలు ప్రారంభించనున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. విడా వీ1 కేవలం స్కూటర్‌ మాత్రమే కాదని, ఈ సెగ్మెంట్‌లో ఓ పవర్‌ ఛేంజ్‌ కానుందని హీరో మోటోకార్ప్‌ ఛైర్మన్‌, సీఈఓ పవన్‌ ముంజాల్‌ విడుదల సందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బజాజ్‌ చేతక్‌, టీవీఎస్‌ ఐక్యూబ్‌తో పాటు ఏథర్‌ ఎనర్జీ, హీరో ఎలక్ట్రిక్‌, ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌లకు విడా పోటీగా నిలవనుంది.

Moto E32 Budget : మోటో E32 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. ఇండియాలో ధర ఎంతంటే?