Integrated Township : వాక్ టు వర్క్ కాన్సెప్ట్‎తో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ విధానం

Integrated Township : నగరంలో ఎక్కడో మూలన నివాసముంటూ ఉద్యోగ, వ్యాపారాల కోసం మరో మూలకు వెళ్లే క్రమంలో రోజూ లక్షల మంది ట్రాఫిక్‌ను కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు పరిష్కారంగా టౌన్‌షిప్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది.

Integrated Township : వాక్ టు వర్క్ కాన్సెప్ట్‎తో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ విధానం

Integrated Township

Integrated Township : హైదరాబాద్ మహానగరం రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటికే ఈ విశ్వనగరం కోటిన్నర జనాభాను దాటింది. అభివృద్ధిలో భాగంగా ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నా ట్రాఫిక్‌తోపాటు మరికొన్ని ఇబ్బందులు భాగ్యనగరాన్ని వెంటాడుతున్నాయి. దీంతో హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. భాగ్యనగరం భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గతంలోనే ప్లాన్ చేసింది. ఇప్పుడు ఈ ప్రత్యేక టౌన్‌షిప్‌ల ఏర్పాటును హెచ్ఎండీఏ వేగవంతం చేసింది. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయనుంది.

Read Also : Home Construction : ఇలా చేస్తే.. ఇంటి నిర్మాణ ఖర్చులు భారీగా తగ్గించుకోవచ్చు..!

వాక్‌ టూ వర్క్ కాన్సెప్ట్‌ :
నగరంలో ఎక్కడో మూలన నివాసముంటూ ఉద్యోగ, వ్యాపారాల కోసం మరో మూలకు వెళ్లే క్రమంలో రోజూ లక్షల మంది ట్రాఫిక్‌ను కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు పరిష్కారంగా టౌన్‌షిప్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. హైదరాబాద్‌ చుట్టూ కొత్త పట్టణాలను నిర్మించి పట్టణీకరణను వికేంద్రీకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఉప్పల్, కోకాపేట్, బుద్వేల్, షాద్‌నగర్ వంటి ప్రాంతాల్లో లేఅవుట్లు పూర్తిచేసిన హెచ్ఎండీఏ… ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో శాటిలైట్ టౌన్‌షిప్‌ల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది. వాక్‌ టూ వర్క్ కాన్సెప్ట్‌తో ఉండే ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లలో అన్ని మౌలిక సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోనుంది.

టౌన్‌షిప్‌ల ఏర్పాటు కోసం ప్రత్యేక పాలసీ :
సిటీలో పెరుగుతున్న ఐటీ పరిశ్రమల కారణంగా నగరం నలుమూలల నివాస, వ్యాపార సముదాయాలు పెరుగుతున్నాయి. ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ఔటర్ రింగ్‌రోడ్డు పరిసర ప్రాంతాల్లో అధికారులు దృష్టి సారించారు. మొదటగా శంకర్‌పల్లి మండలం మోకిలా వద్ద 165 ఎకరాల ప్రభుత్వ భూమిలో టౌన్‌షిప్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది హెచ్ఎండీఏ. హైదరాబాద్ చుట్టూ టౌన్‌షిప్‌ల ఏర్పాటు కోసం గతంలోనే ప్రభుత్వం ఒక ప్రత్యేక పాలసీని రూపొందించింది. దీంట్లో ఒకే లేఅవుట్‌లో ఇల్లు, ఆఫీసులు, స్కూల్స్‌, హోటల్స్ రిక్రియేషన్ వంటి అంశాల కోసం భూ కేటాయింపులు చేసి అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. కొత్త ప్రభుత్వం కూడా ఈ అంశంపై ఫోకస్ చేయాలని నిర్ణయించడంతో అధికారులు తమ చర్యలను వేగవంతం చేశారు.

హెచ్ఎండీఏ రూపొందించిన లేఅవుట్లకు మంచి డిమాండ్ వస్తుంది. క్లియర్ టైటిల్ ఉండడం అన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు నగరవాసులు అలాంటి భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉప్పల్ భగాయత్ వద్ద ఏర్పాటుచేసిన లేఅవుట్‌లో హెచ్ఎండీఏ కమర్షియల్ స్పేస్, ఆఫీస్ స్పేస్, మల్టీ యూజ్‌తో పాటు నివాసం కోసం కొన్ని ప్లాట్లను ప్రత్యేకంగా కేటాయించింది. దీంతో ఆ లేఅవుట్‌లో ప్లాట్లు కొనుగోలుకు నగరవాసుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆ అనుభవంతో సరికొత్త పద్ధతిలో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ల నిర్మాణానికి హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

భూములపై అధికారుల కసరత్తు :
ప్రధానంగా ఔటర్ రింగ్‌రోడ్‌ సమీపంలో స్పెషల్ టౌన్‌షిప్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండం పరిధిలోని దామర్లపల్లి ప్రాంతంలో 533 ఎకరాల్లో టౌన్‌షిప్ నిర్మాణానికి ప్రణాళిక రచించింది. నందిగామ మండలం చేగురూ ప్రాంతంలో 100 ఎకరాల్లో మరో టౌన్‌షిప్ ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇక ప్రభుత్వ భూముల్లో టౌన్‌షిప్స్ ఏర్పాటు కూడా ప్రభుత్వ యోచనలో ఉంది. బొల్లారం, జవహార్‌నగర్‌తోపాటు శంషాబాద్ ప్రాంతాల్లో ఉన్న వందలాది ఎకరాల భూములపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్స్‌లో నివాస, వాణిజ్య అవసరాలకు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో ఎడ్యూకేషన్‌, హెల్త్‌కేర్‌, పార్కులు, ఆటస్థలాలు, పర్యావరణ హితమైన పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నారు. కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా ఇతర ప్రైవేటు సంస్థలను కూడా ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్స్‌ నిర్మాణంలో భాగస్వామ్యం చేసేలా హెచ్ఎండీఏ చర్యలు తీసుకుంటుంది.

Read Also : Dream Home: అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులపై భారీ ఆశలు.. ఆ రేంజ్‌లో ఇళ్లు రావాలంటోన్న నిపుణులు