House Rates: 43 నగరాల్లో పెరిగిన ఇళ్ల ధరలు.. హైదరాబాద్ లో సగటు ఇంటి ధర చదరపు అడుగుకు ఎంతంటే?

భారత్ లో నిర్మాణ రంగం స్థిరంగా కొనసాగుతోంది. అయినప్పటికీ దేశంలోని మొత్తం 43 నగరాల్లో ఇళ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.

House Rates: 43 నగరాల్లో పెరిగిన ఇళ్ల ధరలు.. హైదరాబాద్ లో సగటు ఇంటి ధర చదరపు అడుగుకు ఎంతంటే?

Housing prices rise in 43 cities how much hike in Hyderabad

House Rates Rise: భారత్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ (Indian Real Estate Market) నిలకడగా ఉన్నా ఇంటి ధరలు మాత్రం క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలోని 43 నగరాల్లో ఇళ్ల ధరలు పెరిగాయని నేషనల్ హౌసింగ్ బ్యాంక్ సర్వేలో (National Housing Bank Survey) తేలింది. గడిచిన మూడు నెలల్లో హైదరాబాద్ లో 7 శాతం గృహాల ధరలు పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి. ఇదే సమయంలో గత ఏడాదితో పోలిస్తే ఇళ్ల అమ్మకాలు సైతం పెరగడం నిర్మాణ రంగంలో జోష్ నింపుతోంది.

హైదరాబాద్ లో 6.9 శాతం పెరిగిన ఇళ్ల ధరలు
భారత్ లో నిర్మాణ రంగం స్థిరంగా కొనసాగుతోంది. అయినప్పటికీ దేశంలోని మొత్తం 43 నగరాల్లో ఇళ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ జూన్‌ త్రైమాసికంలో గృహాల ధరలు నగరం, ప్రాంతానికి అనుగుణంగా సగటున 5 శాతం పెరిగినట్లు నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ విడుదల చేసిన హౌసింగ్‌ ప్రెస్‌ ఇండెక్స్‌ డేటా తెలియజేస్తోంది. మన హైదరాబాద్‌ విషయానికి వచ్చే సరికి గడిచిన మూడు నెలల్లో ఇళ్ల ధరలు 6.9 శాతం పెరిగాయి. గ్రేటర్ సెంట్రల్ సిటీతో పాటు నగర శివారు వరకు ప్రాంతాన్ని, నిర్మాణ ప్రాజెక్టును బట్టి ఇళ్ల ధరలు చదరపు అడుగుకు 300 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి.

చదరపు అడుగు రూ.3,200 నుంచి ఫ్లాట్స్
ప్రస్తుతం హైదరాబాద్ లో పెరిగిన ధరల ప్రకారం నగర శివారు ప్రాంతాల్లో చదరపు అడుగు 3200 రూపాయల నుంచి ఫ్లాట్స్ లభిస్తున్నాయి. అంటే అపార్ట్మెంట్లో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల్లో లభిస్తోంది. అదే కాస్త సిటీకి దగ్గరగా అయితే చదరపు అడుగు రూ.4 వేల నుంచి రూ.5 వేలుగా ఉంది. ఇక్కడ డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల్లో వస్తోంది. ఇక ఐటీ హబ్కు దగ్గరగా వెస్ట్ జోన్ పరిసరాల్లో అయితే చదరపు అడుగు రూ.6,500 నుంచి మొదలు రూ.20 వేల వరకు ఇంటి ధరలున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో గృహ రుణాల రేట్ల పెంపు ప్రభావం, అంతర్జాతీయ ఆర్థిక సమస్యల ప్రభావం ఇంకా హౌసింగ్‌ మార్కెట్‌పై పడలేదని, వచ్చే ఆరు నెలల కాలంలోనూ అమ్మకాల డిమాండ్‌ బలంగానే ఉంటుందని నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ అంచనా వేస్తోంది.

Also Read: భాగ్యనగరంలో ఆకాశహర్మ్యాలు.. 59 అంతస్తుల వరకు భారీ స్కైస్క్రాపర్స్

అందుబాటులోనే హైదరాబాద్ లో ఇంటి ధరలు
దేశంలోని మిగతా నగరాల్లో అత్యధికంగా అహ్మదాబాద్‌లో ఇళ్ల ధరలు 9.1 శాతం పెరగ్గా, బెంగళూరులో 8.9 శాతం, కోల్‌కతాలో 7.8 శాతం చొప్పున పెరిగాయి. అంటే మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే మన హైదరాబాద్ లో ఇంటి ధరలు అందుబాటులోనే వన్నాయని లెక్కలు చెబుతున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరువాత హైదరాబాద్లో ఇళ్ల ధరలు మరింతగా పెగిగే అవకాశం ఉందని, ఇంటి కొనుగోలు విషయంలో త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ఇళ్ల అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోన్న హైదరాబాద్.. 26 శాతం పెరిగిన సేల్స్