Hyundai Creta Facelift : ఈ నెల 16న హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కొత్త కారు వచ్చేస్తోంది.. బుకింగ్స్ ఓపెన్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
Hyundai Creta Facelift Launch in India : హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కొత్త మోడల్ కారు 28 ట్రిమ్, ఇంజన్, ట్రాన్స్‌మిషన్ కాంబినేషన్‌లో రానుంది. ఈ కొత్త కారు ధర రూ. 11 లక్షల నుంచి రూ. 20 లక్షలు (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.

Hyundai Creta facelift is available in 28 trim, engine, transmission combinations
Hyundai Creta Facelift Launch in India : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను జనవరి 16న భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ వాహనం కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు, మీరు ఇందులో ఒకదాన్ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. కొత్త హ్యుందాయ్ క్రెటా వేరియంట్ లైనప్‌కి సంబంధించి మీకోసం కొన్ని ఆసక్తికరమైన విషయాలను అందిస్తున్నాం. అవేంటో ఓసారి లుక్కేయండి.
2024 హ్యుందాయ్ క్రెటాలో మూడు ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5-లీటర్ ఎంపీఐ పెట్రోల్ (115పీఎస్ 144ఎన్ఎమ్), 1.5-లీటర్ కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ (160పీఎస్ 253ఎన్ఎమ్), 1.5-లీటర్ యూ2 సీఆర్డీఐ డీజిల్ (116పీఎస్ 250ఎన్ఎమ్). 1.5-లీటర్ ఎంపీఐ పెట్రోల్ ఇంజన్‌ను 6-స్పీడ్ ఎంటీ లేదా ఐవీటీతో జత చేయవచ్చు. 1.5-లీటర్ కప్పా టర్బో జీడీఐ పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డీసీటీని మాత్రమే పొందుతుంది.
Read Also : Moto G34 5G Launch : ఈ నెల 9న భారత్‌కు మోటో G34 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
అయితే, 1.5-లీటర్ యూ2 సీఆర్డీఐ డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ ఎంటీ, 6-స్పీడ్ ఏటీని కలిగి ఉంది. హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ మొత్తం E, EX, S, S(O), SX, SX Tech, SX(O) అనే ఏడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉండనుంది. మొత్తం మీద, కొత్త హ్యుందాయ్ క్రెటాలో 28 ట్రిమ్, ఇంజన్, ట్రాన్స్‌మిషన్ కాంబినేషన్‌లు ఉన్నాయి. క్రెటా పెట్రోల్‌లో 15, క్రెటా టర్బో పెట్రోల్‌లో రెండు, క్రెటా డీజిల్‌లో 11 ఉన్నాయి.

Hyundai Creta facelift combinations
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్ :
- హ్యుందాయ్ క్రెటా 1.5 ఎంపీఐ ఎంటీ ఈ
- హ్యుందాయ్ క్రెటా 1.5 ఎంపీఐ ఎంటీ ఈఎక్స్
- హ్యుందాయ్ క్రెటా 1.5 ఎంపీఐ ఎంటీ ఎస్
- హ్యుందాయ్ క్రెటా 1.5 ఎంపీఐ ఎంటీ ఎస్(ఓ)
- హ్యుందాయ్ క్రెటా 1.5 ఎంపీఐ ఎంటీ ఎస్ఎక్స్
- హ్యుందాయ్ క్రెటా 1.5 ఎంపీఐ ఎంటీ ఎస్ఎక్స్ డీటీ
- హ్యుందాయ్ క్రెటా 1.5 ఎంపీఐ ఎంటీ ఎస్ఎక్స్ టెక్
- హ్యుందాయ్ క్రెటా 1.5 ఎంపీఐ ఎంటీ ఎస్ఎక్స్ టెక్ డీటీ
- హ్యుందాయ్ క్రెటా 1.5 ఎంపీఐ ఎంటీ ఎస్ఎక్స్(ఓ)
- హ్యుందాయ్ క్రెటా 1.5 ఎంపీఐ ఎంటీ ఎస్ఎక్స్(ఓ) డీటీ
- హ్యుందాయ్ క్రెటా 1.5 ఎంపీఐ ఐవీటీ ఎస్(ఓ)
- హ్యుందాయ్ క్రెటా 1.5 ఎంపీఐ ఐవీటీ ఎస్ఎక్స్ టెక్
- హ్యుందాయ్ క్రెటా 1.5 ఎంపీఐ ఐవీటీ ఎస్ఎక్స్ టెక్ డీటీ
- హ్యుందాయ్ క్రెటా 1.5 ఎంపీఐ ఐవీటీ ఎస్ఎక్స్(ఓ)
- హ్యుందాయ్ క్రెటా 1.5 ఎంపీఐ ఐవీటీ ఎస్ఎక్స్(ఓ)
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ టర్బో పెట్రోల్ :

Hyundai Creta facelift
- హ్యుందాయ్ క్రెటా 1.5 టర్బో డీసీటీ ఎస్ఎక్స్(ఓ)
- హ్యుందాయ్ క్రెటా 1.5 టర్బో డీసీటీ ఎస్ఎక్స్ (ఓ) డీటీ
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ డీజిల్ :
- హ్యుందాయ్ క్రెటా 1.5 సీఆర్డీఐ ఎంటీ ఈ
- హ్యుందాయ్ క్రెటా 1.5 సీఆర్డీఐ ఎంటీ ఈఎక్స్
- హ్యుందాయ్ క్రెటా 1.5 సీఆర్డీఐ ఎంటీ ఎస్
- హ్యుందాయ్ క్రెటా 1.5 సీఆర్డీఐ ఎంటీ ఎస్(ఓ)
- హ్యుందాయ్ క్రెటా 1.5 సీఆర్డీఐ ఎంటీ ఎస్ఎక్స్ టెక్
- హ్యుందాయ్ క్రెటా 1.5 సీఆర్డీఐ ఎంటీ ఎస్ఎక్స్ టెక్ డీటీ
- హ్యుందాయ్ క్రెటా 1.5 సీఆర్డీఐ ఎంటీ ఎస్ఎక్స్(ఓ)
- హ్యుందాయ్ క్రెటా 1.5 సీఆర్డీఐ ఎంటీ ఎస్ఎక్స్(ఓ) డీటీ
- హ్యుందాయ్ క్రెటా 1.5 సీఆర్డీఐ ఏటీ ఎస్(ఓ)
- హ్యుందాయ్ క్రెటా 1.5 సీఆర్డీఐ ఏటీ ఎస్ఎక్స్(ఓ)
- హ్యుందాయ్ క్రెటా 1.5 సీఆర్డీఐ ఏటీ ఎస్ఎక్స్(ఓ) డీటీ
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ 2024 ధర రూ. 11 లక్షల నుంచి రూ. 20 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉంటుందని అంచనా. కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, రాబోయే టాటా కర్వ్‌లకు పోటీగా మార్కెట్లోకి రానుంది.
Read Also : Royal Enfield Hunter 350 : రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 చూశారా? మరో రెండు కొత్త కలర్ ఆప్షన్లు ఇదిగో..!