Hyundai: భారీ తగ్గింపు ధరలకు హ్యుందాయ్ కార్లు.. ఈ ఛాన్స్ మిస్‌ చేసుకోవద్దు..

హ్యుందాయ్ వెన్యూపై రూ.70,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

Hyundai: భారీ తగ్గింపు ధరలకు హ్యుందాయ్ కార్లు.. ఈ ఛాన్స్ మిస్‌ చేసుకోవద్దు..

Updated On : April 6, 2025 / 7:59 PM IST

హ్యుందాయ్ ఇండియా తన హ్యాచ్‌బ్యాక్‌, కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లపై ఈ నెలలో భారీ తగ్గింపు ధరలను అందిస్తోంది. పలు మోడళ్లలో రూ. 70,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ నెల 30 వరకు ఈ డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ఇన్సెన్టివ్స్‌ను అందిస్తోంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్‌పై డిస్కౌంట్
హ్యుందాయ్ ఎక్స్‌టర్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మార్కెట్లో ఈ కారు టాటా పంచ్‌తో పోటీ పడుతోంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ హ్యుందాయ్ ఎక్స్‌టర్‌పై కస్టమర్లు మొత్తం రూ.50,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. దీని ధర రూ.5.99-రూ.10.43 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది.

ఎక్స్‌టర్ 1.2-లీటర్ కప్పా 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో, 82 బీహెచ్‌పీ, 113.8 ఎన్ఎమ్ టార్క్‌తో వచ్చింది. ఫైవ్-స్పీడ్ మాన్యువల్‌తో మార్కెట్లో ఉంది. హ్యుందాయ్ సిఎన్జీ వేరియంట్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ఇది 68 బీహెచ్‌పీ, 95.2 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఇందులో కార్గో స్థలాన్ని పెంచడానికి డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీని వాడారు.

హ్యుందాయ్ వెన్యూపై డిస్కౌంట్
హ్యుందాయ్ వెన్యూపై రూ.70,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ధర రూ.7.94 లక్షలు – రూ.13.62 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. త్రీ ఇంజిన్ ఆప్షన్‌, సెవెన్‌ ట్రిమ్ లెవెల్స్‌లో లభిస్తుంది.

హ్యుందాయ్ ఐ20 డిస్కౌంట్
హ్యుందాయ్ స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్ ఐ20పై రూ.65,000 వరకు తగ్గింపు ధరల అందుకోవచ్చు. దీని ఎక్స్‌ షోరూమ్ ధర రూ.7.04 లక్షల నుంచి రూ.11.24 లక్షల మధ్య ఉంది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10
హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 NIOSపై రూ. 68,000 వరకు తగ్గింపు ధరను అందుకోవచ్చు. దీని ఎక్స్‌ షోరూమ్ ధర రూ.5.98 లక్షల నుంచి రూ.8.38 లక్షల మధ్య ఉంటుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చింది.