Post Office RD : పోస్టాఫీస్‌లో సూపర్ స్కీమ్.. ఈ RD స్కీమ్‌లో నెలకు రూ. 3500 డిపాజిట్ చాలు.. ఎన్ని లక్షలు సంపాదించుకోవచ్చంటే?
Post Office RD : పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ప్రతి నెలా రూ. 3500 డిపాజిట్ చేశారంటే రికరింగ్ డిపాజిట్ ఖాతాలపై 6.7 శాతం వార్షిక వడ్డీని పొందవచ్చు. ఎంత డబ్బు వస్తుందో లెక్కలతో చూద్దాం..
- పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా?
- పోస్టాఫీసులో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఎలా పనిచేస్తుంది?
- నెలకు రూ. 3500 డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుంది?
Post Office RD : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? పోస్టాఫీస్ వినియోగదారుల కోసం అద్భుతమైన బ్యాంకింగ్ సర్వీసులతో పాటు వివిధ తపాలా సేవలను కూడా అందిస్తోంది. పోస్టాఫీస్‌లో జనరల్ సేవింగ్స్ అకౌంట్లను కూడా ఓపెన్ చేయొచ్చు.
అందులో టైమ్ డిపాజిట్ స్కీమ్, రికరింగ్ డిపాజిట్ స్కీమ్, మంత్లీ ఇన్వెస్టమెంట్ స్కీమ్ వంటి వివిధ సేవింగ్స్ పథకాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పోస్టాఫీస్ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి. అందుకే వీటిపై ప్రభుత్వ గ్యారెంటీ ఉంటుంది. ఎలాంటి రిస్క్ ఉండదు అనమాట.
మీరు పోస్టాఫీస్‌లో మీ డబ్బులను డిపాజిట్ చేసే ప్రతి పైసా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. అలాగే, పోస్టాఫీస్‌లో రికరింగ్ డిపాజిట్ ఖాతాలను కూడా ఓపెన్ చేయొచ్చు. పోస్టాఫీస్ ఆర్డీ పథకంలో ప్రతి నెలా రూ. 3500 జమ చేస్తే, మెచ్యూరిటీ సమయంలో మీకు ఎంత డబ్బు వస్తుందో ఇప్పుడు లెక్కలతో వివరంగా తెలుసుకుందాం..
పోస్టాఫీస్ ఆర్డీ ఖాతాలపై 6.7 శాతం వడ్డీ :
పోస్టాఫీస్ కస్టమర్లకు రికరింగ్ డిపాజిట్ (RD) ఖాతాలపై 6.7 శాతం వార్షిక వడ్డీ రేటు లభిస్తుంది. మీరు RD ఖాతాలలో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. పోస్టాఫీస్ ఆర్డీ పథకం కింద మీరు నెలకు కనీసం రూ. 100 డిపాజిట్ చేయవచ్చు.
దీనికి గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు. కావలసినంత పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీస్ ఆర్డీ పథకం కింద సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. జాయింట్ అకౌంటులో గరిష్టంగా ముగ్గురిని చేర్చుకోవచ్చు.
ప్రతి నెలా రూ. 3500 డిపాజిట్.. మెచ్యూరిటీ టైంలో ఎంతంటే? :
పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్ 5 ఏళ్లలో అంటే.. 60 నెలలలో మెచ్యూర్ అవుతుంది. మెచ్యూరిటీ తర్వాత మరో 5 ఏళ్ల పాటు పొడిగించుకోవచ్చు. మీరు పోస్టాఫీస్ ఆర్డీ పథకంలో ప్రతి నెలా రూ. 3500 డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో మొత్తం రూ. 2,49,776 లభిస్తుంది.
5 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ. 3500 చొప్పున మీరు పెట్టిన రూ. 2,10,000 పెట్టుబడితో పాటు రూ. 39,776 వడ్డీ కూడా వస్తుంది. పోస్టాఫీస్ ఆర్డీ పథకంలో 5 ఏళ్ల పాటు ప్రతి నెలా రూ. 3500 డిపాజిట్ చేస్తే మొత్తం రూ. 39,776 వడ్డీ లభిస్తుంది.
