ఆర్థిక మందగమనంపై భారత్ తక్షణ చర్యలు అవసరం : IMF

  • Published By: sreehari ,Published On : December 24, 2019 / 08:18 AM IST
ఆర్థిక మందగమనంపై భారత్ తక్షణ చర్యలు అవసరం : IMF

Updated On : December 24, 2019 / 8:18 AM IST

ప్రపంచ ఆర్థిక వృద్ధిలో ఒకటైన ఆర్థిక వ్యవస్థ మందగమనాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు తక్షణ చర్యలు అవసరమని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పేర్కొంది. ఆర్థిక మందగమనం వెంటనే తిరోగమనం చెందాలంటే అందుకు భారత ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టాలని వార్షిక సమీక్షలో IMF ఈ విషయాన్ని వెల్లడించింది. వినియోగం, పెట్టుబడులు తగ్గిపోవడం, పన్ను ఆదాయం పతనంతో పాటు ఇతర కారణాలతో ప్రపంచంలో వేగంగా వృద్ధిచెందే ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారత ఆర్థిక వ్యవస్థ మందగమనానికి ప్రధాన కారణమని IMF తెలిపింది.

పేదరికం నుంచి మిలియన్ల మందిని గట్టెక్కించిన భారత్.. ప్రస్తుతం మధ్యస్థ ఆర్థిక మందగమనంతో కొనసాగుతోందని IMF ఆసియా, పసిఫిక్ శాఖ అధికారి రానిల్ సాల్గోడో తెలిపారు. దేశంలో ప్రస్తుతం దేశంలో ఆర్థిక మందగమనంపై ఆయన మాట్లాడుతూ.. ఉన్నత వృద్ధిలోకి తిరిగి తెచ్చేందుకు అత్యవసర విధానాలపై చర్యలు అవసరమని సాల్గోడో అభిప్రాయపడ్డారు. 

మరోవైపు ఆర్థిక వ్యవస్థను వృద్ధిలోకి తిరిగి తెచ్చేందుకు ప్రభుత్వానికి కూడా పరిమిత స్థాయి మాత్రమే ఉందని, ప్రత్యేకించి అధిక రుణ స్థాయిలు, వడ్డీ చెల్లింపులపైనే ప్రధానంగా దృష్టిసారించినట్టు ద్రవ్య నిధి తెలిపింది. దేశంలో మందగమనం ఆశ్చర్యపరిచిందని, దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని అంచనాను వచ్చే నెలలో విడుదల కానున్న వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్‌లో దాని వృద్ధి అంచనాలను గణనీయంగా తగ్గించడానికి ఒక విధానాన్ని సెట్ చేసినట్టు IMF చీఫ్ ఎకనామిస్ట్ గీత గోపీనాథ్ ప్రస్తావించారు. 2019 అక్టోబర్ నెలలో 6.1 శాతానికి క్షీణించగా, 2020 ఔట్ లుక్ లో 7.0శాతానికి మరింత తగ్గనున్నట్టు IMF తెలిపింది. 

ఒకవేళ దేశంలో ఆర్థిక మందగమనం అలానే కొనసాగితే మాత్రం భారత కేంద్ర బ్యాంకు పాలసీ రేటును తగ్గించే అవకాశం ఉందని స్లాగడో అభిప్రాయపడ్డారు. ఈ ఏడాదిలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక రుణ రేటును ఐదుసార్లు తొమ్మిదేళ్ల కనిష్టానికి తగ్గించింది. కానీ, ఈ నెలలో జరిగిన చివరి సమావేశంలో పాలసీలో మార్పులు లేకుండా అలానే ఉంచేసింది.

వినియోగదారుల డిమాండ్, తయారీదారు కార్యకలాపాల ఒప్పందాలతో వార్షిక వృద్ధి అంచనాను సెంట్రల్ బ్యాంకు 6.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. జూలై-సెప్టెంబర్ కాలంలో ఆరేళ్లలో భారత అర్థిక వ్యవస్థ నెమ్మదిగా వృద్ధి సాధించగా, ప్రభుత్వ డేటా ప్రకారం.. ఏడాది క్రితమే 7.0 శాతం నుంచి 4.5శాతానికి తగ్గిపోయింది.