కరోనా దెబ్బను తట్టుకోవడానికి….ట్యాక్స్ రూల్స్,బ్యాడ్ లోన్ నిబంధనల సడలింపు!

భారత్ లో కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. కరోనా కారణంగా దేశం షట్ డౌన్ అయిపోయింది. దీంతో చిరు వ్యాపారులు,చిన్న,మధ్యతరగతి కంపెనీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్టాక్ మార్కెట్లు కూడా దశాబ్దాలలో లేనివిధంగా నష్టపోతున్నాయి. ఈ సమయంలో చిన్న,మధ్యతరగతి కంపెనీలకు సాయంగా లోన్ రీపేమెంట్ నిబంధనలు,ట్యాక్స్ బ్రేక్స్ ను సులభతరం చేయాలని భారత్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
రుణ సంస్థలను విస్తరించడం మరియు చిన్న సంస్థలకు బ్యాడ్ లోన్ నిబంధనలను సడలించడం వంటివి ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని సమాచారం. అంతేకాకుండా ఆతిథ్య మరియు టూరిజం కంపెనీలకు జీఎస్టీ తొలగిండం,కమర్షియల్ వెహికల్ కొనేవాళ్లకు లోన్ రీపేమెంట్ రిలీఫ్ వంటివి పరిశీలనలో ఉన్నాయి.
వైరస్ వ్యాప్తి ప్రభావం నుండి 2.7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్ చాలా ఒత్తిడిలో ఉంది. మరోవైపు అమెరికా, చైనా మరియు ఇండోనేషియాతో సహా దేశాలు వృద్ధిలో పడిపోవడాన్ని ఎదిరించడానికి బిలియన్ డాలర్లు ఖర్చు చేసే ప్రణాళికలను ప్రకటించాయి.
See Also | కరోనా ఎక్కడ పుట్టిందో తెలియదు…వైరస్ వెలుగులోకొచ్చిన హుబే ప్రావిన్స్ లో కొత్త కేసుల్లేవ్