ఇండిగో ఆఫర్: రూ.999కే విమాన టిక్కెట్

  • Published By: vamsi ,Published On : May 15, 2019 / 04:12 AM IST
ఇండిగో ఆఫర్: రూ.999కే విమాన టిక్కెట్

Updated On : May 15, 2019 / 4:12 AM IST

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో మరోసారి ప్రత్యేక ఆఫర్లతో వచ్చేసింది. వేసవి ప్రత్యేక ఆఫర్ పేరిట మే 16వ తేదీ వరకు 53 దేశీయ, 17 అంతర్జాతీయ రూట్లలో నడిచే సర్వీసులకు రాయితీలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.  అన్నీరకాల పన్నులు కలుపుకొని ప్రారంభ విమాన టిక్కెట్ ధరను రూ.999గా నిర్ణయించింది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న ప్రయాణికులు మే 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 28 లోపు ఎప్పుడైనా ప్రయాణం చేసే అవకాశం ఉంది.

వీటిలో ఢిల్లీ-అహ్మదాబాద్, ముంబై-హైదరాబాద్, హైదరాబాద్-దుబాయి, చెన్నై-కువైట్, ఢిల్లీ-కౌలాలంపూర్, బెంగళూరు-మాలే మధ్య నడిచే సర్వీసులతోపాటు ఇతర సర్వీసులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని ఇండిగో ప్రకటించింది. అలాగే హాలీడే సీజన్‌లో అధిక బరువును తీసుకువెళ్లే వారికి 30 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది.