ఇండిగో సర్వర్లు డౌన్ : కష్టాల్లో ప్రయాణికులు

  • Published By: chvmurthy ,Published On : November 4, 2019 / 09:10 AM IST
ఇండిగో సర్వర్లు డౌన్ : కష్టాల్లో ప్రయాణికులు

Updated On : November 4, 2019 / 9:10 AM IST

దేశీయ విమానయాన సంస్ధ ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన కంప్యూటర్ నెట్వర్క్ వ్యవస్ధలో సాంకేతిక సమస్య తలెత్తింది.  దీంతో ఆ విమాన యాన సంస్ధకు చెందిన విమానాల రాకపోకల్లోతీవ్ర అంతరాయం ఏర్పడింది. నెట్వర్క్ సిస్టమ్స్  సర్వర్ డౌన్ అవటంతో అన్ని విమానాశ్రయాల్లోనూ ప్రయాణికులు కౌంటర్ల వద్ద గంటల తరబడి వేచి ఉన్నారు.ఉదయం 9:40 గంటల వరకు విమానాలు షెడ్యూల్ ప్రకారమే నడిచాయని కొచ్చి విమానాశ్రయంలోని ఇండిగో అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం సిస్టం స్లో అయ్యిందని ఆయన అన్నారు.సాంకేతిక లోపానికి గల కారణాలు తెలియ రాలేదని, సమస్య తీర్చటానికి సంబంధిత టెక్నికల్  సిబ్బంది రంగంలోకి  దిగారని, త్వరలోనే సేవలను పునురుధ్ధరిస్తామని సంస్ధ ప్రతినిధు

లు చెప్పారు.  ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా ఫోన్ ద్వారా  సేవలు అందిస్తున్నామని తెలిపారు.  ఇండిగో వెబ్ సైట్ లో ఎలాంటి ఇబ్బంది లేదని, దాని ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని సంస్ధ తెలిపింది. 

గత జులైలోనూ బెంగుళూరు విమనాశ్రయంలో ఇండిగో సర్వర్లలో ఇలాంటి సమస్యే తలెత్తింది. అప్పుడు ఆ సంస్ధకు చెందిన విమానాలు దాదాపు 30 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. 
ఇంట‌ర్‌గ్లోబ్ ఏవియేష‌న్ సంస్థ‌కు చెందిన ఇండిగో.. దేశీయ మార్కెట్లో 50 శాతం షేర్ క‌లిగి ఉన్న‌ది. ప్ర‌యాణికులు కొంద‌రు త‌మ స‌మ‌స్య‌ల‌ను ట్విట్ట‌ర్‌లో పంచుకున్నారు. ముంబైలోని ఇండిగో ట‌ెర్మిన‌ల్ వ‌ద్ద ప్ర‌యాణికులు  బారులు తీరి ఉన్నారు. ఢి