IndiGo’s expansion: భారీ విస్తరణకు ఇండిగో ప్లాన్.. 500 విమానాలు కొనుగోలు చేయనున్న సంస్థ
తాజాగా మరో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కూడా భారీ సంఖ్యలో విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 500 కొత్త విమానాలు కొనుగోలు చేయాలని ఇండిగో నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్ బస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

IndiGo’s expansion: టాటా సంస్థకు చెందిన ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ భారీ స్థాయిలో విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎయిర్ బస్, బోయింగ్ సంస్థల నుంచి ఎయిర్ ఇండియా 470 విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
Harish Rao: తెలంగాణ దశ దిశ మార్చిన నాయకుడు సీఎం కేసీఆర్: మంత్రి హరీష్ రావు
తాజాగా మరో దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కూడా భారీ సంఖ్యలో విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 500 కొత్త విమానాలు కొనుగోలు చేయాలని ఇండిగో నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్ బస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే టర్కీ ఎయిర్‌లైన్స్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇండిగో ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా వెల్లడించారు. దీని ద్వారా ఇండియా నుంచి యూరప్, ఇస్తాంబుల్ వంటి నగరాలకు విమానాల సంఖ్యను పెంచే అవకాశం ఉంటుందన్నారు.
Nikki Yadav Murder: నిక్కీ యాదవ్ హత్య కేసులో ట్విస్ట్.. రెండేళ్లక్రితమే పెళ్లి చేసుకున్న జంట
ఇండిగో సంస్థ యూరప్‌కు చెందిన ఎయిర్ బస్ సంస్థ నుంచి విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. 2030 వరకు వీలైనన్ని విమానాలు కొనుగోలు చేయాలని సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం ఇండిగో సంస్థకు 300 విమానాలున్నాయి. ఇప్పుడు 500 విమానాల్ని కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, విమానాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచే సేవల విస్తరణ మొదలవుతుందని వినయ్ మల్హోత్రా అన్నారు. విమానాల లభ్యతను బట్టి దేశంలోని నగరాలతోపాటు, అంతర్జాతీయంగానూ విమానాలు నడుపుతారు.
ఇండిగో సంస్థకు చెందిన విమానాలు రోజూ 1800 ప్రయాణాలు చేస్తున్నాయి. వీటిలో 10 శాతం అంతర్జాతీయ సర్వీసులు ఉన్నాయి. ప్రస్తుతం టర్కీ, ఇస్తాంబుల్‌తోపాటు యూరప్‌లోని అనేక నగరాలకు విమానాలు నడుపుతున్నామని, త్వరలోనే కెన్యా, ఇండోనేషియాలకు కూడా విమానాలు నడుపుతామని వినయ్ చెప్పారు.