Infinix Hot 60 5G Plus Sale : AI ఫీచర్లతో ఇన్ఫినిక్స్ హాట్ 60 5G ప్లస్ ఫోన్.. ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే.. డోంట్ మిస్..!

Infinix Hot 60 5G Plus : ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త 5G ఫోన్ లాంచ్ అయింది. అతి సరసమైన ధరలో ఏఐ ఫీచర్లతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ఎలా కొనాలంటే?

Infinix Hot 60 5G Plus Sale : AI ఫీచర్లతో ఇన్ఫినిక్స్ హాట్ 60 5G ప్లస్ ఫోన్.. ఇలా కొన్నారంటే అతి తక్కువ ధరకే.. డోంట్ మిస్..!

Infinix Hot 60 5G Plus

Updated On : July 18, 2025 / 12:29 AM IST

Infinix Hot 60 5G Plus : కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ ఫోన్ వచ్చేసింది. అతి చౌకైన ధరలో అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునేలా (Infinix Hot 60 5G Plus) ఉంది. ఇన్ఫినిక్స్ కొత్త హాట్ 60 5G ప్లస్ కంపెనీ ఇటీవలే భారత మార్కెట్లో లాంచ్ అయింది. అయితే, ఇప్పుడు అధికారికంగా సేల్ మొదలైంది. ఇన్ఫినిక్స్ తక్కువ బడ్జెట్‌ ధరలోనే కొనుగోలు చేయొచ్చు. ఇంతకీ ఈ 5G ఫోన్ ఎలా సొంతం చేసుకోవాలంటే?

ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ ధర ఎంతంటే? :
ఈ ఫోన్ అత్యంత సరసమైన ధరలో భారత మార్కెట్లో కేవలం రూ. 10,499 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది. బ్యాంకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే.. మీకు రూ. 500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో ఈ ఫోన్ ధర రూ. 9,999కే లభిస్తుంది.

ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో కూడా పొందవచ్చు. కలర్ ఆప్షన్ విషయానికి వస్తే.. కారామెల్ గ్లో, షాడో బ్లూ, స్లీక్ బ్లాక్, టండ్రా గ్రీన్ అనే 4 కలర్ ఆప్షన్లు ఉన్నాయి. ఎంతో ట్రెండీగా యువతకు నచ్చేలా ఉన్నాయి.

డిస్‌ప్లే, డిజైన్ :
ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ ఫోన్ 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. రిఫ్రెష్ రేట్ 120Hz కలిగి ఉంది. గేమింగ్ లేదా సోషల్ మీడియా స్క్రోల్ స్మూత్ ఉంటుంది. ప్రత్యేకత ఏమిటంటే.. “డైనమిక్ బార్” ఫీచర్‌ను కూడా కలిగి ఉంది. నోటిఫికేషన్లతో పాటు ఇంటరాక్షన్ అద్భుతంగా ఉంటుంది.

Read Also : Motorola Edge 50 Fusion : ఇది కదా డిస్కౌంట్.. అత్యంత చౌకైన ధరకే మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్.. ఈ ఆఫర్ మళ్లీ రాదు..!

పర్ఫార్మెన్స్, ప్రాసెసర్ :
ఈ ఇన్ఫినిక్స్ ఫోన్‌లో మీడియాటెక్ డైమన్షిటీ 7020 చిప్‌సెట్ కలిగి ఉంది. ఈ ధర రేంజ్‌లో చాలా పవర్‌ఫుల్ ఫోన్. 6GB LPDDR5X ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఇన్ఫినిక్స్ ప్రత్యేకంగా హైపర్ ఇంజిన్ 5.0 గేమింగ్ టెక్నాలజీతో వస్తుంది. తద్వారా 90fps వరకు గేమింగ్ పర్ఫార్మెన్స్ పొందవచ్చు. తక్కువ బడ్జెట్‌లో గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు.

AI ఫీచర్లు, స్మార్ట్ సాఫ్ట్‌వేర్ :
ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ ఫోన్ ఆండ్రాయిడ్ 15-ఆధారిత XOS 15పై రన్ అవుతుంది. AI-ఆధారిత స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఫోలాక్స్ వాయిస్ అసిస్టెంట్‌ స్పెషల్ అట్రాక్షన్. వాయిస్ కమాండ్‌లతో అనేక టాస్కులను పూర్తి చేయగలదు.

మీ లొకేషన్ లేదా మెంటల్ స్టేటస్ అనుగుణంగా వాల్‌పేపర్‌లను క్రియేట్ చేసే ఏఐ వాల్‌పేపర్ జనరేటర్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో “వన్ ట్యాప్ AI బటన్” కూడా ఆకట్టుకునేలా ఉంది. డబుల్ ప్రెస్, లాంగ్ ప్రెస్ కోసం వివిధ టాస్కులకు కస్టమైజ్ చేసుకోవచ్చు. 30 కన్నా ఎక్కువ యాప్‌లు, ఫీచర్‌లను యాక్సెస్ చేయొచ్చు. గూగుల్ సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ కూడా ఉంది.

కెమెరా :
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఇన్ఫినిక్స్ బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. సూపర్ నైట్ మోడ్, స్కై షాప్, స్లో మోషన్, బ్యూటీ పోర్ట్రెయిట్స్ వంటి అనేక ఏఐ మోడ్‌లు ఉన్నాయి. డే లేదా నైట్ అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయవచ్చు. ఫ్రంట్ సైడ్ 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. డ్యూయల్-మోడ్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉంది.

బ్యాటరీ, రీవర్స్ ఛార్జింగ్ :
హాట్ 60 5G+ పవర్‌ఫుల్ 5200mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది రోజంతా ఫోన్‌ వాడిన ఛార్జింగ్ ఎక్కువ సమయం వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు కలిగి ఉంది. “బైపాస్ ఛార్జింగ్” అనే స్పెషల్ ఫీచర్ కూడా ఉంది. గేమింగ్ సమయంలో ఫోన్ ఛార్జర్ నుంచి నేరుగా పవర్ అందుతుంది. బ్యాటరీ హెల్త్ చెక్కుచెదరదు. రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ కూడా ఉంది. ఈ ఫోన్ నుంచి ఇతర ఫోన్లకు కూడా ఛార్జ్ చేయవచ్చు.

డిజైన్ :
ఈ ఫోన్ నిర్మాణ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎందుకంటే IP64 రేటింగ్ ఉంది. వాటర్, డస్ట్ నిరోధకత కలిగి ఉంది.

కనెక్టివిటీ :
5G సపోర్టుతో పాటు ఇన్ఫినిక్స్ అల్ట్రాలింక్ కనెక్టివిటీ ఫీచర్‌ను కూడా అందించింది. తద్వారా తక్కువ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాలలో కూడా ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ కాల్స్ చేసుకోవచ్చు.

తక్కువ బడ్జెట్‌లో ఏఐ ఫీచర్లతో :
ఇన్ఫినిక్స్ హాట్ 60 5G+ ఫోన్ దాదాపు రూ. 10వేల బడ్జెట్ ధరలో వచ్చింది. అద్భుతమైన డిస్‌ప్లే, లాంగ్ బ్యాటరీ, డిజైన్, ఏఐ రిచ్ స్మార్ట్ ఫీచర్లతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ సరసమైన 5G ఫోన్ మాత్రమే కాదు.. రోజువారీ టాస్కులకు అద్భుతంగా ఉంటుంది.