Bank Interest Rates : మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందా? డిపాజిట్లపై 7శాతం కన్నా ఎక్కువ వడ్డీని అందించే 6 బ్యాంకులివే..!

Bank Interest Rates : 7 శాతం కన్నా ఎక్కువ సేవింగ్ డిపాజిట్ రేట్లను అందించే బ్యాంకుల జాబితాలో RBL బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్ టాప్ ప్లేసులో ఉన్నాయి.

Bank Interest Rates : మీకు సేవింగ్స్ అకౌంట్ ఉందా? డిపాజిట్లపై 7శాతం కన్నా ఎక్కువ వడ్డీని అందించే 6 బ్యాంకులివే..!

Bank Interest Rates

Updated On : April 26, 2025 / 5:34 PM IST

Bank Interest Rates : చాలామంది డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటారు. అందులో ఎక్కువగా సేవింగ్స్ అకౌంట్లలో డిపాజిట్ చేస్తుంటారు. వాస్తవానికి, బ్యాంకు సేవింగ్ ఖాతాల్లో డిపాజిట్లపై పెద్దమొత్తంలో వడ్డీ రాదు. బ్యాంకులు చెల్లించే వడ్డీ నామమాత్రంగానే ఉంటుంది. అందుకే ఇతర పథకాల్లోకి తమ డబ్బును పెట్టుబడిగా పెడుతుంటారు.

Read Also : Airtel Recharge : ఎయిర్‌టెల్ యూజర్లకు పండగే.. కొత్త ‘ఆల్ ఇన్ వన్’ రీఛార్జ్ ప్లాన్.. భారత్ సహా 189 దేశాల్లో వాడొచ్చు.. 365 రోజులు అన్నీ ఫ్రీ..!

ఇటీవలే చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పాటు సేవింగ్స్ అకౌంట్ బ్యాలెన్స్‌పై కూడా వడ్డీ రేట్లను పెంచేశాయి. ఈ 6 బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగా సేవింగ్స్ అకౌంట్లలో వడ్డీ రేటును అందిస్తున్నాయి. గరిష్టంగా సేవింగ్స్ అకౌంట్లలో 7శాతానికి పైగా వడ్డీ అందిస్తున్నాయి. ఆరు బ్యాంకులు చెల్లించే వడ్డీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ సేవింగ్ డిపాజిట్లపై అందించే వడ్డీ రేట్లను తగ్గించాయి. రెండు ప్రైవేట్ రంగ దిగ్గజాల ఖాతాదారులు ఇప్పుడు తమ రూ. 50 లక్షల వరకు సేవింగ్ డిపాజిట్లపై సంవత్సరానికి 2.75 శాతం (గతంలో 3 శాతం)గా వడ్డీని పొందవచ్చు.

అనేక బ్యాంకులు సేవింగ్ డిపాజిట్లపై భారీగా అధిక రేట్లను అందిస్తున్నాయి. బ్యాంక్ బజార్ డేటా ప్రకారం.. ప్రస్తుతం సేవింగ్స్ అకౌంట్లపై సంవత్సరానికి 7 శాతం కన్నా ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్న టాప్ 7 బ్యాంకులు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం..

RBL బ్యాంక్ :
ఈ బ్యాంకు సేవింగ్స్ డిపాజిట్ రేటు అత్యధికంగా 7.5 శాతంగా ఉంది. అయితే, రూ. 25 లక్షల నుంచి రూ. 3 కోట్ల మధ్య డిపాజిట్లకు వర్తిస్తుంది. రూ. 1 లక్ష వరకు డిపాజిట్లకు 3.5 శాతం, రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల మధ్య డిపాజిట్లకు 4.5 శాతం వడ్డీని పొందవచ్చు. రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల పరిధిలో సేవింగ్స్ డిపాజిట్లను కలిగిన ఖాతాదారులకు 5.5 శాతం, రూ. 10 లక్షల నుంచి రూ. 25 లక్షల డిపాజిట్లకు 6.5 శాతంగా వడ్డీని అందిస్తుంది.

IDFC ఫస్ట్ బ్యాంక్ :
ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు కూడా 7.25 శాతం అధిక వడ్డీ రేటును అందిస్తుంది. ఈ వడ్డీని పొందాలంటే కనీస బ్యాలెన్స్ రూ. 10 లక్షలు ఉండాలి.

ఇండస్ఇండ్ బ్యాంక్ :
ఈ ప్రైవేట్ రంగ బ్యాంకు రూ. 10 లక్షలకు పైగా రోజువారీ డిపాజిట్లను నిర్వహించే సేవింగ్స్ ఖాతాదారులకు 7 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

యెస్ బ్యాంక్ :
బ్యాంక్ సేవింగ్ డిపాజిట్లపై 7 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. రోజువారీ డిపాజిట్లలో రూ. 10 లక్షలకు పైగా నిర్వహించే వినియోగదారులకు వర్తిస్తుంది.

బంధన్ బ్యాంక్ :
కనీసం రూ. 10 లక్షల బ్యాలెన్స్ నిర్వహించే కస్టమర్లు తమ సేవింగ్ డిపాజిట్లపై 7 శాతం రాబడిని పొందవచ్చు.

Read Also : Apple iPhone 14 : ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. చౌకైన ధరకే ఆపిల్ ఐఫోన్ 14 కొనేసుకోండి.. ఈ డిస్కౌంట్ మళ్లీ జన్మలో రాదు!

AU బ్యాంక్ :
ఈ చిన్న ఫైనాన్స్ బ్యాంకు సేవింగ్స్ ఖాతాదారులకు సంవత్సరానికి 7 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ రాబడి రేటుకు అర్హత పొందాలంటే కనీసం రూ. 10 లక్షల బ్యాలెన్స్ కలిగి ఉండాలి.

Note : బ్యాంక్ బజార్ వెబ్‌సైట్ ప్రకారం.. ఏప్రిల్ 16, 2025 నాటి డేటా, వడ్డీ రేట్లు బ్యాంకుల వెబ్‌సైట్‌ల ప్రకారం ఉంటాయి. బ్యాంకు విధానాల ప్రకారం ఆయా వడ్డీ రేట్లను సవరిస్తుంటాయి.