SCSS Scheme : పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. ఇలా పెట్టుబడి పెట్టారంటే.. రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. 20వేలు సంపాదించుకోవచ్చు!

SCSS Scheme : పోస్టాఫీసు స్కీమ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? సీనియర్ సిటిజన్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయండి. రిటైర్మెంట్ తర్వాత భారీ మొత్తంలో సంపాదించుకోవచ్చు.

SCSS Scheme : పోస్టాఫీసులో సూపర్ స్కీమ్.. ఇలా పెట్టుబడి పెట్టారంటే.. రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ. 20వేలు సంపాదించుకోవచ్చు!

SCSS Scheme

Updated On : November 7, 2025 / 7:03 PM IST

SCSS Scheme : సీనియర్ సిటిజన్ల కోసం అద్భుతమైన పథకం.. రిటైర్మెంట్ తర్వాత కూడా నెలకు రూ. 20వేలు సంపాదించుకోవచ్చు. చాలామంది రిటైర్మెంట్ తర్వాత కూడా డబ్బుకు లోటు లేకుండా జీవించాలని కోరుకుంటారు. మీరు కూడా రిటైర్మెంట్ తర్వాత నెలవారీ ఆదాయం కోరుకుంటే ఈ పోస్టాఫీస్ పథకంలో చేరండి. ప్రభుత్వం అందించే ఈ పథకం చాలా సేఫ్ కూడా.

సురక్షితమైన పెట్టుబడులతో పాటు (SCSS Scheme) గ్యారెంటీ రాబడిని కూడా అందిస్తుంది. ఈ పోస్టాఫీస్ పథకంలో పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందిస్తోంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. పెట్టుబడిదారులకు 8.2శాతం వడ్డీ రేటు అందిస్తుంది. ఇంతకీ ‘సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్’ పథకం గురించి పూర్తి వివరాలతో ఇప్పుడు తెలుసుకుందాం..

సీనియర్ సిటిజన్ స్కీమ్ ఏంటి? :
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది రిటైర్మెంట్ పొందిన సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రభుత్వ పెట్టుబడి పథకం. పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా స్వతంత్రంగా జీవించేందుకు అద్భుతమైన పథకం. వృద్ధాప్యంలో కూడా ఆదాయాన్ని పొందవచ్చు. పెట్టుబడిదారులు ఒకేసారి డిపాజిట్ చేసి సంపాదించిన వడ్డీ ప్రతి 3 నెలలకు ఒకసారి పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంటులో నేరుగా డిపాజిట్ అవుతుంది.

Read Also : Honda Activa 125 : ఇది కదా ఆఫర్ మామ.. హోండా యాక్టివా 125పై బిగ్ డిస్కౌంట్.. ఫీచర్లు, మైలేజీ కోసమైనా ఈ స్కూటర్ కొనేసుకోవచ్చు..!

నెలకు రూ. 20వేలకు పైగా ఆదాయం :
ఈ సీనియర్ సిటిజన్ పథకం వార్షిక వడ్డీ రేటు 8.2 శాతం అందిస్తుంది. వడ్డీ చెల్లింపులు త్రైమాసికానికి ఒకసారి జరుగుతాయి. ఈ పథకంలో పెట్టుబడిదారుడు రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెడితే వారికి వార్షిక వడ్డీ రేటు సుమారు రూ. 2,46,000 అందుతుంది. ఈ వడ్డీ ప్రతి 3 నెలలకు రూ. 61,500గా చెల్లిస్తుంది. నెలవారీగా లెక్కిస్తే మాత్రం సుమారు రూ. 20,500 సాధారణ నెలవారీ ఆదాయంగా అందుతుంది.

పెట్టుబడి పరిమితి ఎంతంటే? :
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో కనీస పెట్టుబడి మొత్తం రూ. 1,000 ఉంటుంది. గరిష్ట పెట్టుబడి పరిమితి రూ. 30 లక్షలు. ఈ పథకం 5 ఏళ్ల కాలానికి చెల్లుతుంది. 5 ఏళ్లు పూర్తి చేసిన తర్వాత పెట్టుబడిదారుడు ప్రతి ఏడాదిలో 3 ఏళ్ల వరకు పొడిగించవచ్చు. మీ ఆదాయం నిరంతరాయంగా కొనసాగుతుంది.

SCSS అకౌంట్ ఎవరు ఓపెన్ చేయొచ్చు? :
ఈ పథకం నుంచి ప్రయోజనం పొందాలంటే ఒక వ్యక్తికి కనీసం 60 ఏళ్ల వయస్సు ఉండాలి. VRS కింద రిటైర్మెంట్ చేసిన 55 ఏళ్లు లేదా 60 ఏళ్ల మధ్య వయస్సు గల వారు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇంకా, 50 ఏళ్ల వయస్సు 60 ఏళ్ల మధ్య వయస్సు గల రక్షణ సేవల నుంచి రిటైర్మెంట్ చేసిన వారు కూడా ఈ పథకం నుంచి ప్రయోజనం పొందవచ్చు.