iPhones iOS 17 Update : ఈ మూడు ఐఫోన్లలో కొత్త iOS 17 అప్‌డేట్ రాదట.. ఏయే ఐఫోన్లలో అప్‌డేట్‌ రానుంది? ఫుల్ లిస్టు ఇదిగో..!

iPhones iOS 17 Update : ఆపిల్ ఐఫోన్ (Apple iPhone) యూజర్లకు అలర్ట్.. మీరు వాడే ఐఫోన్ ఏ మోడల్ ఓసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే.. రాబోయే ఐఓఎస్ 17 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ (iOS 17 Update) మూడు ఐఫోన్లలో రాదట.. మీ ఫోన్ ఉందేమో ఓసారి చెక్ చేసుకోండి.

iPhones iOS 17 Update : ఈ మూడు ఐఫోన్లలో కొత్త iOS 17 అప్‌డేట్ రాదట.. ఏయే ఐఫోన్లలో అప్‌డేట్‌ రానుంది? ఫుల్ లిస్టు ఇదిగో..!

iPhones iOS 17 Update (Photo : Google)

iPhones iOS 17 Update : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) బ్రాండ్ ఐఫోన్లలో అనేక కొత్త మోడళ్లను గ్లోబల్ మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. ఐఫోన్లకు సంబంధించి కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కూడా ఎప్పటికప్పుడూ రిలీజ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు, ఆపిల్ లేటెస్ట్ iOS 17 సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ను జూన్ 5న జరగనున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC)లో ప్రవేశపెట్టనుంది. ఈ ఈవెంట్‌ ఇంకా రెండు నెలల దూరంలో ఉంది. MacRumors నివేదిక ప్రకారం.. ఆపిల్ దిగ్గజం 6 ఐపీఎల్ డివైజ్‌లకు సాఫ్ట్‌వేర్ సపోర్టును నిలిపివేసేందుకు ప్లాన్ చేస్తోంది. అవేంటో ఓసారి చూద్దాం..

గతంలో ఆపిల్ ప్రవేశపెట్టిన ఐఫోన్ 8 (iPhone 8), ఐఫోన్ 8 ప్లస్ (iPhone 8 Plus), ఐఫోన్ X (iPhone X) రాబోయే iOS వెర్షన్‌ అందుకోలేవని నివేదిక పేర్కొంది. ఫస్ట్ జనరేషన్ 9.7 అంగుళాల iPad Pro, 12.9-అంగుళాల iPad Pro లేదా 5వ జనరేషన్ iPad కూడా (iPadOS 17) అప్‌డేట్ పొందకపోవచ్చు. ఈ పాత (iPhone)లు iPadలు అనేక కారణాల వల్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ సపోర్టు నిలిచిపోనుంది.

Read Also : Apple iPhone 14 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఇంకా తక్కువ ధరకు పొందాలంటే? ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!

ఎందుకంటే.. చాలా పాతవి కావడమే కారణంగా చెప్పవచ్చు. ఇందులో కొత్త ఫీచర్లను యాడ్ చేయాలంటే.. లేటెస్ట్ హార్డ్‌వేర్ తప్పనిసరి. నిర్దిష్ట కాలవ్యవధి వరకు మాత్రమే ఆపిల్ పాత యూనిట్‌లకు సపోర్టు అందిస్తుంది. పైన పేర్కొన్న డివైజ్‌లు నవంబర్ 2015, నవంబర్ 2017 మధ్య మార్కెట్లోకి రిలీజ్ అయ్యాయి. ఆపిల్ iOS 17తో కొన్ని అద్భుతమైన ఫీచర్లను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఆపిల్ 2024 నుంచి యూరోపియన్ చట్టాల ప్రకారం.. ఆపిల్ యాప్‌లు, థర్డ్-పార్టీ యాప్ స్టోర్‌ల సైడ్‌లోడింగ్‌కు సపోర్టు అందిస్తుందనిభావిస్తున్నారు.

iPhones iOS 17 Update _ 3 iPhones won’t likely get upcoming iOS 17 software update, here are the details

iPhones iOS 17 Update (Photo : Google)

టెక్ దిగ్గజం కార్‌ప్లే అప్‌డేట్‌ల పరంగా విడ్జెట్‌లను, మల్టీ డిస్‌ప్లేలకు సపోర్టు అందించనుంది. ఈ కొత్త వెర్షన్ స్టేబుల్, సామర్థ్యంపై మరింత దృష్టి పెట్టనుంది. ఆపిల్ కొత్త సాఫ్ట్‌వేర్ వెర్షన్ విజువల్‌గా పెద్దగా మార్పు చేయదు. బ్లూమ్‌బెర్గ్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం.. iOS 17 విడుదలతో iPhone యూజర్లకు అత్యధిక ఫీచర్‌లను అందించాలని ఆపిల్ యోచిస్తోందని పేర్కొంది. కానీ, ఆ ఫీచర్లు ఏంటి? అనేది మాత్రం రివీల్ చేయలేదు. రాబోయే వారాల్లో ఆపిల్ డెవలపర్ కాన్ఫరెన్స్‌ సమయంలో కొత్త iOS వెర్షన్ మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది.

రాబోయే లేటెస్ట్ iOS 17 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కు అర్హత ఉన్న ఐఫోన్ డివైజ్‌‌‌ల జాబితాను రివీల్ చేసింది. అందులో iPhone XS, iPhone XS Max, iPhone XR, iPhone 11, iPhone 11 Pro సిరీస్, iPhone 12 సిరీస్, iPhone 12 Pro సిరీస్, iPhone 13 సిరీస్, iPhone 13 Pro, ఆపిల్ iPhone 14 సిరీస్, iPhone 14 Pro సిరీస్ ఉన్నాయి. మరో నివేదిక ప్రకారం.. iPhone 6a, iPhone 6s Plus, iPhone 7, iPhone 7 Plus, ఒరిజినల్ iPhone SE మోడల్, ఫైనల్ iPod టచ్, సెకండ్ జనరేషన్ iPad Air, నాల్గో జనరేషన్ iPad mini వంటి డివైజ్‌ల్లోనూ మేజర్ అప్‌డేట్స్ నిలిపివేయనున్నట్టు ఆపిల్ కంపెనీ గత ఏడాదిలోనే ప్రకటించింది.

Read Also : Viral AI ChatGPT Ban : చాట్‌జీపీటీ బ్యాన్.. దేశాలన్నీ ఈ టూల్ ఎందుకు బ్యాన్ చేస్తున్నాయో తెలుసా? ఫుల్ లిస్టు మీకోసం..!