iQoo 12 5G Launch : అద్భుతమైన ఫీచర్లతో ఐక్యూ 12 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌‌లో ఈరోజే లాంచ్.. లైవ్ స్ట్రీమ్ ఇలా చూడొచ్చు..!

iQoo 12 5G Launch : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐక్యూ నుంచి 12 5జీ మోడల్ భారత మార్కెట్లో ఈరోజు (డిసెంబర్ 12)న లాంచ్ కానుంది. లైవ్ స్ట్రీమ్ ఎలా చూడాలి, ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

iQoo 12 5G Launch : అద్భుతమైన ఫీచర్లతో ఐక్యూ 12 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌‌లో ఈరోజే లాంచ్.. లైవ్ స్ట్రీమ్ ఇలా చూడొచ్చు..!

iQoo 12 5G Launch in India Today _ How to Watch Live Stream, Expected Price, Specifications

iQoo 12 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే కాస్తా ఆగండి.. భారత మార్కెట్లోకి ఈరోజు (డిసెంబర్ 12) ఐక్యూ 12 5G ఫోన్ లాంచ్ కానుంది. ఈ లాంచ్ ఈవెంట్ యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. లాంచ్‌కు ముందే చైనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి అనేక వివరాలను వెల్లడించింది.

Read Also : Redmi Note 13 Pro India : 2024 జనవరిలో రెడ్‌మి నోట్ 13ప్రో వచ్చేస్తోంది.. ధర ఎంత? ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ఇటీవల, వివో సబ్-బ్రాండ్ ఐక్యూ 12 5జీ దేశంలో 3 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందుకోనున్నట్లు ప్రకటించింది. అందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీ‌పై రన్ అవుతుందని, 50ఎంపీ ప్రైమరీ కెమెరా నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ కలిగి ఉండనుంది. ఐక్యూ 12 5జీ ఫోన్, ఐక్యూ 12 ప్రోతో పాటు నవంబర్‌లో చైనాలో లాంచ్ అయింది. ఐక్యూ 12 5జీ ప్రీమియం సెగ్మెంట్‌లో ఎంట్రీ ఇవ్వనుందని భావిస్తున్నారు.

ఐక్యూ 12 5జీ లాంచ్, ధర వివరాలు (అంచనా) :

భారత మార్కెట్లో ఐక్యూ 12 5జీ లాంచ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 5:00 గంటలకు ప్రారంభమవుతుంది. వర్చువల్ ఈవెంట్ ఐక్యూ ఇండియా యూట్యూబ్ ఛానెల్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ హ్యాండ్‌సెట్ లాంచ్ అయిన తర్వాత అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో రానుంది. ఇటీవలి లీక్ ప్రకారం.. ఐక్యూ 12 5జీ ధర రూ. 12జీబీ ర్యామ్ + 256జీబీ వేరియంట్ ధర 52,999 ఉండవచ్చు. 16జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 57,999కు సొంతం చేసుకోవచ్చు.

iQoo 12 5G Launch in India Today _ How to Watch Live Stream, Expected Price, Specifications

iQoo 12 5G Launch in India Today  

అదేవిధంగా, ఐక్యూ 12 మోడల్ 12జీబీ ర్యామ్ + 256జీబీ వేరియంట్ ధర సీఎన్‌వై 3,999 (దాదాపు రూ. 45వేలు) ధర ట్యాగ్‌తో చైనాలో లాంచ్ అయింది. ఈ మోడల్ ధర 16జీబీ ర్యామ్ + 512జీబీ వేరియంట్ ధర సీఎన్‌వై 4,299 (దాదాపు రూ. 50వేలు), 16జీబీ ర్యామ్ + 1టీబీ వేరియంట్ ధర సీఎన్‌వై 4,699 (సుమారు రూ. 53వేలు) ఉండవచ్చు.

ఐక్యూ 12 5జీ స్పెసిఫికేషన్లు :
ఇప్పటివరకు, ఆపరేటింగ్ సిస్టమ్, ప్రాసెసర్, కెమెరాలతో సహా ఐక్యూ 12 5జీ భారతీయ వేరియంట్ కొన్ని స్పెసిఫికేషన్‌లను కంపెనీ ప్రకటించింది. క్వాల్‌కామ్ 4ఎన్ఎమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్ఓసీతో రానున్న భారత్‌లో మొదటి ఫోన్‌ ఇదే కావచ్చు. మూడు ఏళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్‌లను పొందుతుందని చెప్పవచ్చు.

100ఎక్స్ డిజిటల్ జూమ్ సపోర్టుతో రెండు 50ఎంపీ సెన్సార్లు, 64ఎంపీ టెలిఫోటో సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. 16ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఐక్యూ 12 5జీ చైనీస్ వెర్షన్ 1.5కె (1,260×2,800 పిక్సెల్‌లు) రిజల్యూషన్, 144హెచ్‌జెడ్ వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1టీబీ వరకు యూఎఫ్ఎస్‌4.0 ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది.

Read Also : Redmi 13C vs Redmi 12C : రెడ్‌మి 13సి లేదా రెడ్‌మి 12సి ఫోన్లలో ఏది కొంటే బెటర్? ధర, ఫీచర్ల వివరాలివే..!