Gold : బంగారం ధర 60 వేలకి పడిపోనుందా..? గోల్డ్ ఇప్పుడు కొని పెట్టుకుంటే లాభమా? నష్టమా?
గోల్డ్ అలంకరణకు ఉపయోగపడే వస్తువే కాదు.. సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా.

Is it profitable or loss to buy Gold now
Gold : బంగారం.. ఆడవాళ్లు అయినా, మగవాళ్లు అయినా ఇష్టపడని వాళ్లు ఉండరు. గోల్డ్ అలంకరణకు ఉపయోగపడే వస్తువే కాదు.. సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా. గోల్డ్ కొనడంలో సంప్రదాయం, సామాజిక అవసరాల కోణం ఉన్నా.. ఫైనల్‌గా బంగారంపై పెట్టే ప్రతీ రూపాయి పెట్టుబడిగానే భావిస్తుంటారు పబ్లిక్. కొన్నాళ్లుగా రేపన్నదే లేదన్నట్లుగా రికార్డుస్థాయికి పెరిగిన బంగారం ధర.. ట్రంప్ విక్టరీతో ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇది ఇంకా తగ్గి..దిగిరావొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి టైమ్‌లో బంగారంపై పెట్టుబడులు ఎంతవరకు సేఫ్.? ఇప్పటి వరకు పెట్టుబడులు పెట్టిన వారు ఎందుకు టెన్షన్ పడుతున్నారు..?
యూఎస్ ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో బులియన్ మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. ఇన్వెస్టర్లు గోల్డ్ నుంచి ఇతర పెట్టుబడి సాధనాల వైపు తమ పెట్టుబడులను మళ్లించారు. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీకి రెక్కలు వచ్చాయి. బిట్ కాయిన్ ఏకంగా మూడు రోజుల్లోనే 33 శాతం పైగా లాభపడింది. బిట్‌కాయిన్ ఆదివారం రాత్రి తొలిసారిగా 90వేల డాలర్లను క్రాస్ చేసింది. దీనికితోడు అమెరికా మార్కెట్లో బుల్ రంకెలు వేయడం గోల్డ్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో గోల్డ్, సిల్వర్ రేట్స్ భారీగా పతనమవుతున్నాయి. 5 నెలల తర్వాత గతవారం గోల్డ్ రేట్ భారీగా పతమైంది. ఇదే ట్రెండ్ మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశముందని అంతర్జాతీయ బులియన్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. వారి అంచనాలకు అనుగుణంగా గోల్డ్ రేట్ దిగివస్తోంది. రాబోయే రోజుల్లో 10 గ్రాముల ధర 60 వేలకి పడిపోవచ్చంటున్నారు నిపుణులు.
ఇన్వెస్టర్ల ఎదురుచూపులు..
ఇక ఇన్వెస్టర్లు అమెరికా కీలక డేటాల కోసం ఎదురుచూస్తున్నారు. యూఎస్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ విడుదల కానుండటం, త్వరలో యూఎస్ రిటైల్ సేల్స్ డేటా వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు ఉత్కంఠగా ఈ డేటా కోసం వేచిచూస్తున్నారు. అలాగే ఈవారం వెలువడే యూఎస్ ఎకనామిక్ డేటాపై ఇన్వెస్టర్లలో ఆసక్తి నెలకొంది. ఇక వడ్డీరేట్ల తగ్గింపుపై ఈవారం యూఎస్ ఫెడ్ చీఫ్ జెరోమ్ పావెల్‌తో సహా పలువురు ఉన్నతాధికారులు క్లారిటీ ఇవ్వనున్నారు. దీంతో కీ ఈవెంట్స్ ముందుండటంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను గోల్డ్ నుంచి ఇతర పెట్టుబడి సాధనాల వైపు మళ్లిస్తున్నారు.
Gold : రానున్న రోజుల్లో మరింతగా తగ్గునున్న బంగారం ధర..! ట్రంప్ విక్టరీ పుణ్యమేనా..?
మరోవైపు గోల్డ్ రేట్స్ రాబోయే 4 నెలల్లో భారీగా తగ్గవచ్చనే అంచనాలు వెలువడునున్నాయి. ఇంటర్నేషనల్ ఎనలిస్టుల విశ్లేషణ ప్రకారం ఈ స్థాయి నుంచి గోల్డ్ రేట్ 20 శాతం క్షీణించే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు. వారు చెబుతోన్న లెక్కల ప్రకారం దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్ 60వేలకు పడిపోయే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. అయితే దేశీయ ఎనలిస్టులు మాత్రం దీనికి భిన్నమైన విశ్లేషణ చేస్తున్నారు. గోల్డ్ రేట్స్ దిగివచ్చే చాన్స్ ఉన్నప్పటికీ.. మరీ భారీ పతనం ఉండకపోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఎవరి లెక్కలు ఎలావున్నా.. బంగారం ధరలు దిగిరావాలని సామాన్య ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
బంగారం మీద ఇన్వెస్ట్‌మెంట్ సేఫేనా.? కాదా.? అన్న చర్చ..
సామాన్యులు అలా ఆలోచిస్తుంటే.. బంగారంపై పెట్టుబడి పెట్టేవారు అయోమయానికి గురవుతున్నారు. స్టాక్ట్ మార్కెట్లు ఎప్పుడు పడిపోతాయో తెలియదు. ఏ చిన్న న్యూస్ అయినా షేర్ వ్యాల్యూను తగ్గించొచ్చు. రియల్ ఎస్టేట్‌లో కూడా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. గోల్డ్ రేట్లు పెరగడమే కానీ.. తగ్గిన దాఖలాలు లేవు. అనుకోకుండా ట్రంప్ విక్టరీతో గోల్డ్‌కు డిమాండ్ కాస్త తగ్గడంతో బంగారం ధరలు దిగి వచ్చాయి. దీంతో ఇప్పుడు బంగారం మీద ఇన్వెస్ట్‌మెంట్ సేఫేనా.? కాదా.? అన్న చర్చ మొదలైంది. అయితే చాలామంది భవిష్యత్ కోసం డబ్బు దాచుకోవాలి అనుకునేవారు గోల్డ్‌నే ఆప్షన్‌గా తీసుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. మరోవైపు ఇదివరకు బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారు.. భవిష్యత్‌లో మరింత తగ్గితే పరిస్థితి ఏంటని అయోమయంలో ఉన్నారు.
Gold Price : మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం గోల్డ్ రేటు ఎంతో తెలుసా?