జనవరి 1నుంచి UPI ఛార్జీలు లేనట్లే

జనవరి 1నుంచి UPI ఛార్జీలు లేనట్లే

Updated On : December 29, 2019 / 4:52 AM IST

జనవరి 1 నుంచి యూపీఐ, రూపే డెబిట్ కార్డుల ఛార్జీలు తీసి వేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. యూపీఐ, రూపే డెబిట్ కార్డులతో కస్టమర్లు జరిపిన లావాదేవీలతో వ్యాపారస్థులపై అదనంగా ఛార్జీల భారం పడుతుంది. ఫలితంగా డిజిటల్.. (యూపీఐ) ట్రాన్సాక్షన్లను ఎంకరేజ్ చేయడం లేదు. ఇప్పుడీ ఉపశమనంతో డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

రూ.50కోట్లకు మించి వార్షిక ఆదాయం ఉన్న వారు కచ్చితంగా తప్పనిసరిగా రెండు డిజిటల్ పేమెంట్లు చూపించాల్సి ఉంటుంది. బ్యాంకులు, స్టేక్ హోల్డర్లు మీటింగ్ తర్వాత నిర్మాలా సీతారామన్ ఇలా అన్నారు. ‘2020 జనవరి 1 నుంచి అమలు చేయనున్న ఎమ్డీఆర్ ఛార్జీల విషయంపై సంతోషంగా ఉన్నాను’ అని తెలిపారు. 

రూపే డెబిట్ కార్డులపై ప్రచారం, యూపీఐ ట్రాన్సాక్షన్లు పెంచితే డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరిగి ఇకో సిస్టమ్ అనేది వృద్ధి చెందుతుంది. ఇలా నగదు రహిత లావాదేవీలు జరుగుతాయి. ఇదే సందర్భంగా ఈ ఆక్షన్ ప్లాట్ ఫాంను లాంచ్ చేసి ఆస్తులును తగిన ధరకే అమ్ముకునేలా  ఏర్పాటు చేశారు ఆర్థిక మంత్రి.