ఆదుకున్న స్పైస్ జెట్ : 500 జెట్ సిబ్బందికి జాబ్ ఆఫర్లు

దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ పెద్ద మనస్సుతో ముందుకొచ్చింది. జెట్ సిబ్బందికి నేనున్నాంటూ స్పైస్ జెట్ జాబ్ ఆఫర్లు చేసింది. 

  • Published By: sreehari ,Published On : April 20, 2019 / 07:16 AM IST
ఆదుకున్న స్పైస్ జెట్ : 500 జెట్ సిబ్బందికి జాబ్ ఆఫర్లు

Updated On : April 20, 2019 / 7:16 AM IST

దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ పెద్ద మనస్సుతో ముందుకొచ్చింది. జెట్ సిబ్బందికి నేనున్నాంటూ స్పైస్ జెట్ జాబ్ ఆఫర్లు చేసింది. 

ప్రముఖ దేశీయ విమానాయన సంస్థ జెట్ ఎయిర్ వేస్ లో తలెత్తిన సంక్షోభంతో జీతాల్లేక ఆ సంస్థలో పనిచేసే 22వేల మంది ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జెట్ ఎయిర్ వేస్ కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, టెక్నికల్ స్టాఫ్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జెట్ ఎయిర్ వేస్ అప్పుల్లో కూరుకుపోవడంతో తమ సిబ్బందికి జీతాలు చెల్లించలేక.. విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది.

దీంతో జెట్ ఎయిర్ వేస్ లో పనిచేసే సిబ్బంది రోడ్డునపడ్డారు. ఈ క్రమంలో జెట్ ఉద్యోగులను ఆదుకునేందుకు దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ పెద్ద మనస్సుతో ముందుకొచ్చింది. జెట్ సిబ్బందికి నేనున్నాంటూ స్పైస్ జెట్ జాబ్ ఆఫర్లు చేసింది. 

తమ సంస్థలో తొలి ప్రాధాన్యం జెట్ సిబ్బందికే  ఇస్తామంటూ 500 మందికి ట్విట్టర్ ద్వారా జాబ్ ఆఫర్ చేసింది. ఈ సందర్భంగా స్పైస్ జెట్ సీఎండీ అజయ్ సింగ్.. జెట్ ఎయిర్ వేస్ సిబ్బందికి జాబ్ ఆఫర్ చేసినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. 100 మంది పైలట్లు, 200మందికి పైగా క్యాబిన్ సిబ్బింది, 200 మంది టెక్నికల్ సిబ్బంది, ఎయిర్ పోర్టు స్టాఫ్ కు జాబ్ ఆఫర్ చేసినట్టు ట్వీట్ చేశారు.

చెన్నై నుంచి ఇద్దరు జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగులను తమ కస్టమర్ సపోర్ట్ ఫంక్షన్ కు తీసుకున్నట్టు ట్వీట్ లో తెలిపారు. మిగతా సిబ్బందిని PR సంస్థ, మోడలింగ్ ఏజెన్సీలు రిక్రూట్ చేసుకున్నట్టు ట్వీట్ చేశారు. జెట్ ఎయిర్ వేస్ సర్వీసులు నిలిచిపోవడంతో ఉద్యోగాలు కోల్పోయిన సంస్థ సిబ్బందికి ఉద్యోగ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్టు అజయ్ సింగ్ తెలిపారు.