Jet Fuel Price Hiked : జెట్ ఇంధనం ధర పెంపు
జెట్ ఇంధనం ధర ఆదివారం పెరిగింది. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ధర కిలోలీటర్‌కు రూ.5,779.84 పెరిగింది....

Jet Fuel Price Hiked
Jet Fuel Price Hiked : జెట్ ఇంధనం ధర ఆదివారం పెరిగింది. ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ధర కిలోలీటర్‌కు రూ.5,779.84 పెరిగింది. జెట్ ఇంధనం ధరతో పాటు ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ ధర కూడా పెరిగింది. (Jet Fuel Price Hiked 5 percent) ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ ప్రకారం ఏవియేషన్ టర్బైన్ ఇంధనం ధర కిలోలీటర్‌కు రూ.5,779.84 లేదా 5.1 శాతం పెరిగింది.
జాతీయ రాజధాని నగరమైన ఢిల్లీలో రూ. 112,419.33 నుంచి రూ.118,199.17 కి పెరిగింది. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో 40 శాతంగా ఉన్న జెట్ ఇంధనం ధరలను వరుసగా నాలుగోసారి పెంచడం వల్ల ఇప్పటికే ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న ఎయిర్‌లైన్స్‌పై భారం పడనుంది. జెట్ ఇంధన ధరల పెంపుతో విమాన చార్జీలు కూడా పెరుగుతాయని భావిస్తున్నారు.