Jio 5G Phone : ఈ ఏడాది కష్టమే.. జియో 5G ఫోన్ వచ్చేది అప్పుడే.. అన్ని 5G ఫోన్ల కన్నా అత్యంత చౌకైన ధరకే రావొచ్చు..!
Jio 5G Phone : భారత మార్కెట్లో 5G సర్వీసులు అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వచ్చే దీపావళికి దేశంలో జియో 5G సర్వీసులు (Jio 5G Services) ప్రారంభం కానున్నట్టు RIL అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించారు.

Jio 5G phone announced in partnership with Google, expected to launch next year
Jio 5G Phone : భారత మార్కెట్లో 5G సర్వీసులు అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వచ్చే దీపావళికి దేశంలో జియో 5G సర్వీసులు (Jio 5G Services) ప్రారంభం కానున్నట్టు RIL అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించారు. ఆగస్టు 29న జరిగిన AGM 2022 సమావేశంలో 5G సర్వీసులతో పాటు Jio 5G Phone కూడా లాంచ్ చేయనున్నట్టు అంబానీ ప్రకటించారు. రిలయన్స్ జియో (Reliance Jio) స్మార్ట్‌ఫోన్ వచ్చే ఏడాదిలో (AGM 2023) సమావేశంలో లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. రిలయన్స్ జియో 5G ఫోన్‌లను అందించేందుకు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం Googleతో కలిసి పనిచేస్తోందని కంపెనీ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు.

Jio 5G phone announced in partnership with Google, expected to launch next year
ఈ ఏడాదిలో జియో 5G ఫోన్ లాంచ్‌ను ఉండదని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది Jio 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని జియో పేర్కొంది. జియో (Jio 5G Phone Ultra) సరసమైన ధరకే అందుబాటులోకి రానుందని అంబానీ వెల్లడించారు. ప్రస్తుతం, దేశీయ మార్కెట్‌లో చాలా 5G ఫోన్‌లు రూ. 20వేల ధరలోఅందుబాటులో ఉన్నాయి. అయితే Jio 5G ఫోన్ ధర మాత్రం రూ. 15వేల కన్నా అత్యంత తక్కువగా ధర ఉండే అవకాశాలు ఉన్నాయి. జియో కంపెనీ Qualcommతో భాగస్వామ్యాన్ని కూడా ప్రకటించింది. ప్రాథమికంగా జియో 5G ఫోన్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ (Snapdragon Chipset) ద్వారా పవర్ అందిస్తుందని తెలిపింది.

Jio 5G phone announced in partnership with Google, expected to launch next year
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా రానున్న Jio 5G ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 400 సిరీస్ చిప్‌సెట్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. సాధారణంగా చౌకైన ఫోన్‌లలో ఎక్కువగా కనిపిస్తుంది. 2022 ఏడాదిలో దీపావళి సందర్భంగా రిలయన్స్ జియో 5G సేవలను ప్రారంభించనుంది. ఇదే సమయంలో ఎయిర్‌టెల్ తన కస్టమర్ల కోసం 5G సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. రిలయన్స్ జియో ముందుగా తమ జియో 5G సర్వీసులను ప్రధానంగా ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై వంటి 4 మెట్రో సిటీల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది.