Jio Bharat 4G Diwali Offer : జియో భారత్ 4జీ ఫోన్‌పై దీపావళి ఆఫర్.. కేవలం రూ. 699కే సొంతం చేసుకోండి..
Jio Bharat 4G Diwali Offer : మీరు ఈ జియో ఫోన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. అయితే, ఇది పరిమిత కాలపు ఆఫర్ మాత్రమేనని గమనించాలి.

Jio Bharat 4G
Jio Bharat 4G Diwali Offer : రిలయన్స్ జియో దీపావళి ధమాకా ఆఫర్.. మీరు జియో వినియోగదారులా? అయితే మీకో గుడ్ న్యూస్. దీపావళికి ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సరికొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది. ఆఫర్‌లో భాగంగా జియో జియోఫోన్ 4జీ ధరలను 30శాతం వరకు తగ్గించింది.
మీరు ఈ జియో ఫోన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేయొచ్చు. అయితే, ఇది పరిమిత కాలపు ఆఫర్ మాత్రమేనని గమనించాలి. జియోభారత్ K1, జియోభారత్ వి 2.4G ధరలు వరుసగా రూ. 699, రూ. 999కు అందుబాటులో ఉన్నాయి. దీనితో పాటు, కంపెనీ రూ.123 రీఛార్జ్ ప్లాన్ కూడా ప్రవేశపెట్టింది.
జియో 4జీ ఫోన్‌ని ఎలా కొనుగోలు చేయాలంటే?:
జియోభారత్ K1, జియోభారత్ వి 2.4జీ ఫోన్‌లను ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు జియోమార్ట్, అమెజాన్ నుంచి రూ. 699కి కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ ఫోన్ వివిధ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు.
జియో రూ. 123 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ :
రిలయన్స్ జియో రూ. 123 రీఛార్జ్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా ప్లాన్‌ల కన్నా 40 శాతం తక్కువ. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. 14జీబీ డేటాతో
వస్తుంది. రిలయన్స్ జియో ఈ ఫోన్‌తో 2జీ నుంచి 4జీకి కూడా మారవచ్చు.