నేటి నుంచే అమల్లోకి : Jio కొత్త All-in-One ప్లాన్లు ఇవే
డేటా సంచలనం, రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు శుక్రవారం (డిసెంబర్ 6) నుంచి అమల్లోకి వచ్చేశాయి.

డేటా సంచలనం, రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు శుక్రవారం (డిసెంబర్ 6) నుంచి అమల్లోకి వచ్చేశాయి.
డేటా సంచలనం, రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లు శుక్రవారం (డిసెంబర్ 6) నుంచి అమల్లోకి వచ్చేశాయి. కొత్త All-in-One పేరుతో జియో ప్రవేశపెట్టిన ఈ కొత్త 11 ప్లాన్లపై ధరలు పెంచడంతో వినియోగదారులపై భారం పడింది. కానీ, ఈ మొత్తం 11 ప్లాన్లలో రూ.199 నుంచి రూ.2,199 రీఛార్జ్ చేసుకున్న యూజర్లకు 300శాతం వరకు అదనంగా బెనిఫెట్స్ అందిస్తోంది.
ఈ జియో ప్లాన్లన్నీ నేటి నుంచి కస్టమర్ల అందరికి అందుబాటులో ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.రిలయన్స్ జియో అందించే 4 ప్లాన్లలో (రూ.199, రూ.399, రూ.555, రూ.2,199) నుంచి రోజుకు 1.5GB హైస్పీడ్ డేటాను ఆఫర్ చేస్తోంది. ఈ నాల్గింటి రీఛార్జ్ ప్లాన్లపై వ్యాలిడెటీ పీరియడ్ ఒక నెల నుంచి 12 నెలల వరకు అందిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా తమ యూజర్లకు ప్రామీస్ చేసినట్టుగానే రిలయన్స్ జియో బెస్ట్ క్వాలిటీ సర్వీసును 300 శాతం బెనిఫెట్స్‌తో తక్కువ ధరకే అందిస్తున్నట్టు పేర్కొంది.
అంతేకాదు.. ప్రతిరోజు హైస్పీడ్ డేటా క్వాటా, జియో నుంచి జియోకు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ఇతర నెట్ వర్క్ (నాన్ జియో)లకు నిమిషాలతో వాయిస్ కాల్స్ అందిస్తోంది. జియో యాప్ బెనిఫెట్స్‌తో కూడిన బండెల్స్ నుంచి కొత్త జియో ప్లాన్లలో నుంచి యూజర్లు తమకు నచ్చిన ప్లాన్ కొనుగోలు చేసుకోవచ్చు.
రిలయన్స్ జియో 1-Month ప్లాన్లు :
రిలయన్స్ జియో మూడు కొత్త All-in-One ప్లాన్లను (Monthly plan) 28 రోజుల కాల పరిమితిపై ఆఫర్ చేస్తోంది. అందులో రూ.199, రూ.249, రూ.349 ప్లాన్లపై హైస్పీడ్ డేటాను అందిస్తోంది. ఒక్కో ప్లాన్‌పై వరుసగా రోజుకు 1.5GB డేటా, 2GB డేటా, 3GB డేటాను ఆఫర్ చేస్తోంది.
జియో 2-Month ప్లాన్లు :
రెండు నెలల కాలపరిమితితో అందించే కొత్త ప్లాన్లలో రూ.399, రూ.444 రెండు ప్రీపెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. ఈ రెండింటి ప్లాన్లను 56 రోజుల కాలపరిమితితో అఫర్ చేస్తోంది. వీటి ద్వారా యూజర్లు రోజుకు 1.5GB డేటా, రూ.2GB డేటాను పొందవచ్చు.
జియో 3-Month ప్లాన్లు :
రెండు రీఛార్జ్ ప్లాన్లలో (రూ.555, రూ.599) మూడు నెలల కాలపరిమితిపై ఆఫర్ చేస్తోంది. ఇతర బెనిఫెట్స్ తో పోలిస్తే.. రోజుకు హైస్పీడ్ డేటా 1.5GB డేటా, రూ.2GB వరకు అందిస్తోంది. ఒక్కో ప్లాన్ పై 84 రోజుల వ్యాలిడెటీ పీరియడ్ ఆఫర్ చేస్తోంది.
జియో 12-నెలల (ఏడాది) ప్లాన్ :
రిలయన్స్ జియో అందించే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లలో ఏడాది ప్లాన్ ఒకటి. 365 రోజుల కాల పరిమితిపై రూ.2,199 రీఛార్జ్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్‌పై రోజుకు 1.5GB వరకు హైస్పీడ్ డేటాను అందిస్తోంది.
జియో Affordable ప్లాన్లు :
రిలయన్స్ జియో అందించే 11 ప్రీపెయిడ్ ప్లాన్లలో రూ.129, రూ.329, రూ.1,299 ఆకర్షణీయమైన మూడు ప్లాన్లు ఇవే. ఇందులో రూ.129 రీఛార్జ్ ప్లాన్‌పై 28 రోజుల వ్యాలిడిటీ, రూ.329 ప్లాన్ పై 84 రోజుల వ్యాలిడిటీ, రూ.1,299 ప్లాన్ పై 365 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. ఈ మూడు ప్లాన్లపై వరుసగా 2GB, 6GB, 24GB వరకు డేటాను ఆఫర్ చేస్తోంది.
ఒక్కో ప్లాన్‌పై Unlimited వాయిస్ కాల్స్ :
* నెలవారీ ప్లాన్లలో (రూ.199, రూ.249, రూ. 349) ప్లాన్లపై 28 రోజుల వ్యాలిడిటీతో పాటు 1,000 నిమిషాల వరకు Unlimited వాయిస్ కాల్స్ అందిస్తోంది.
* రెండు నెలల ప్లాన్లలో (రూ.399, రూ.399) ప్లాన్లపై 56 రోజుల వ్యాలిడిటీతో పాటు 2,000 నిమిషాల వరకు Unlimited వాయిస్ కాల్స్ ఆఫర్ చేస్తోంది.
* మూడు నెలల ప్లాన్లలో (రూ.555, రూ.599) ప్లాన్లపై 84 రోజుల వ్యాలిడిటీ, 3,000 నిమిషాల వరకు Unlimited వాయిస్ కాల్స్.
* 12 నెలల ప్లాన్లలో (రూ.2,199) ప్లాన్ పై 365 రోజుల వ్యాలిడిటీ, 12,000 నిమిషాల వరకు Unlimited వాయిస్ కాల్స్.
Affordable మూడు ప్లాన్లలో :
* రూ.129 ప్లాన్.. 289 రోజుల వ్యాలిడిటీతో 1,000 నిమిషాల Unlimited వాయిస్ కాల్స్.
* రూ.329 ప్లాన్.. 84 రోజుల వ్యాలిడిటీ, 3,000 నిమిషాల Unlimited వాయిస్ కాల్స్.
* రూ.1,299 ప్లాన్..365 రోజుల వ్యాలిడిటీ, 12,000 నిమిషాల Unlimited కాల్స్.