Amazon, Flipkart కాస్కోండి : RIL ఈ-కామర్స్ JioMart వచ్చేసింది!

జియో రాకతో టెలికం రంగంలో డేటా విప్లవాన్ని సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఈ కామర్స్ రంగంలోకి కూడా అడుగుపెట్టేసింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు పోటీగా JioMart పేరుతో ఈ కామర్స్ వెంచర్ ప్రవేశపెట్టింది. RIL రిటైల్ విభాగమైన రిలయన్స్ రిటైల్ దీన్ని ఆపరేట్ చేయనుంది. ఇదివరకే నేవీ ముంబైలో కస్టమర్ల కోసం థానె, కల్యాణ్ ప్రాంతాల్లో కొత్త వెంచర్ పైలట్ ప్రాజెక్ట్ లాంచ్ అయింది. ఇది క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించనుంది.
రిల్ చైర్మన్, భారతీయ బిలియనీర్ ముఖేశ్ అంబానీ గత ఏడాదిలోనే దేశీయ న్యూ కామర్స్ ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త వెంచర్ ద్వారా దేశంలోని 20 కోట్ల నివాసితులకు మూడు కోట్ల ఆఫ్ లైన్ రిటైలర్లతో కనెక్ట్ అయ్యేలా సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది.
ప్రీ-రిజిస్ట్రేషన్.. రూ.3 వేల వరకు డిస్కౌంట్లు :
ఈ-కామర్స్ ఆపరేషన్లలో భాగంగా రిలయన్స్ రిటైల్ JioMart కోసం ప్రీ రిజిస్ట్రేషన్లను స్వీకరిస్తోంది. ఈ కొత్త ప్లాట్ ఫాం ద్వారా పోర్ట్ పోలియోతో 50వేల గ్రాసరీ ప్రొడక్టులను ఆఫర్ చేయడమే లక్ష్యంగా.. ఫ్రీ హోం డెలివరీతోపాటు ఎలాంటి రిటర్న్ పాలసీ అనే ప్రశ్న తలెత్తకుండా సర్వీసులను అందించనుంది.
అందిన రిపోర్టు ప్రకారం.. రిలయన్స్ రిటైల్.. జియోమార్ట్ లో రిజిస్ట్రేషన్ల కోసం జియో యూజర్లను ఆహ్వానిస్తోంది. ప్రీలిమినరీ డిస్కౌంట్లను కూడా ఆఫర్ చేస్తోంది. ముందుగా ప్రీ-రిజిస్టర్ చేసుకున్న కస్టమర్లు రూ.3వేలు వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
స్థానిక వేర్ హౌజింగ్ కు బదులుగా రిలయన్స్.. జియో మార్ట్‌ను ఆన్ లైన్ నుంచి ఆఫ్ లైన్ (O2O) మార్కెటింగ్ చేయనుంది. దగ్గరలోని మర్చెంట్ల నుంచి గ్రాసరీ ఐటమ్స్ కస్టమర్లకు త్వరగా చేరేలా సర్వీసులను వేగవంతం చేయనుంది.