ఈఎంఐ కట్టలేదని ఏడు రెట్లు జరిమానా వేసిన బ్యాంకు

ఈఎంఐ చెల్లించలేదన్న కారణంతో కర్ణాటక బ్యాంకు ఏడు రెట్లు జరిమానా విధించడం వివాదాస్పదం అయ్యింది. ఈఎంఐ చెల్లింపులను కేంద్రం వాయిదా వేసినప్పటికీ సదరు బ్యాంకు మాత్రం ఏకంగా ఏడురెట్ల మొత్తాన్ని జరిమానా విధించడంతో ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆదేశాలకు తిలోదకాలు ఇస్తూ కర్ణాటక బ్యాంక్ వినియోగదారుని నుంచి పరోక్షంగా దోపిడీకి పాల్పడుతోందని విమర్శలు వెల్లువెత్తాయి. బాధితుడు సంగమేష్ హడపద తెలిపిన వివరాల మేరకు తమ సెలూన్ షాపు బంద్ అవడంతో ఈఎంఐ చెల్లించలేకపోయాడు.
ఒక్క నెల ఈఎంఐ జాప్యం చేయడంతో రూ.590లు చొప్పున బ్యాంక్ మొత్తం ఏడు రెట్లు రూ.4150లను వసూలు చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.