హైదరాబాద్‌లో ప్రాంతీయ రెఫరెన్స్ లేబరేటరీని ప్రారంభించిన లుపిన్ లిమిటెడ్
నివారణ ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంతో పాటుగా అందుబాటు ధరలలో ఉంచడానికి లుపిన్ డయాగ్నోస్టిక్స్ కట్టుబడి ఉందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ లేబరేటరీ ప్రారంభంతో, లుపిన్ డయాగ్నోస్టిక్స్ అత్యధిక నాణ్యత కలిగిన, ఆధారపడతగిన డయాగ్నోస్టిక్ సేవలను హైదరాబాద్‌తో పాటుగా చుట్టుపక్కల నగరాల వినియోగదారులకు అందించనుంది

Lupin Limited has started a regional reference laboratory in Hyderabad
అంతర్జాతీయంగా ఫార్మా రంగంలో అగ్రగామి సంస్ధ లుపిన్ లిమిటెడ్ (లుపిన్) నేడు తమ నూతన ప్రాంతీయ రెఫరెన్స్ లేబరేటరీని తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. లుపిన్ డయాగ్నోస్టిక్స్ నెట్‌వర్క్ విస్తరణ, దక్షిణ భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించుకోవాలనే కంపెనీ వ్యూహాలలో భాగం. ఈ రీజనల్ రెఫరెన్స్ లేబరేటరీ, లుపిన్ డయాగ్నోస్టిక్స్ యొక్క ప్రస్తుత నెట్‌వర్క్ భారతదేశవ్యాప్తంగా 380కు పైగా లుపి మిత్రా (లుపిన్ యొక్క ఫ్రాంచైజీ కలెక్షన్ కేంద్రాలు), 23 లేబరేటరీలకు కనెక్ట్ చేస్తుంది.
Delhi Govt: ఢిల్లీ సీఎం నిర్ణయం.. సిసోడియా, జైన్ స్థానాల్లో మంత్రులుగా అతిషి, సౌరభ్
నివారణ ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికీ చేరువ చేయడంతో పాటుగా అందుబాటు ధరలలో ఉంచడానికి లుపిన్ డయాగ్నోస్టిక్స్ కట్టుబడి ఉందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ లేబరేటరీ ప్రారంభంతో, లుపిన్ డయాగ్నోస్టిక్స్ అత్యధిక నాణ్యత కలిగిన, ఆధారపడతగిన డయాగ్నోస్టిక్ సేవలను హైదరాబాద్‌తో పాటుగా చుట్టుపక్కల నగరాల వినియోగదారులకు అందించనుంది. సాధారణ, ప్రత్యేక పరీక్షలతో పాటుగా లుపిన్ డయాగ్నోస్టిక్స్ లో మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్, సైటోజెనిటిక్స్, ఫ్లో సైటోమెట్రి, సైటాలజీ, మైక్రోబయాలజీ, సెరాలజీ, హెమటాలజీ, ఇమ్యునాలజీ, రొటీన్ బయోకెమిస్ట్రీలతో పాటు మరెన్నో పరీక్షలు చేస్తారు. లుపిన్ డయాగ్నోస్టిక్స్ వద్ద అర్హత కలిగిన క్లీనికల్ నిపుణులు అత్యాధునిక ఆటోమేషన్ పై ఆధారపడతారు.