Maruti Suzuki :మారుతీ సుజుకీకి బిగ్ షాక్.. రూ.200 కోట్ల జరిమానా విధించిన సీసీఐ
ప్యాసింజర్ వెహికల్ రంగంలో డీలర్ డిస్కౌంట్ కంట్రోల్ పాలసీ అమలు చేయడం ద్వారా యాంటీ-కాంపిటీటివ్(పోటీ-వ్యతిరేక)కార్యకలాపాలకు పాల్పండిందన్న కారణాలతో మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ కి

Maruti
Maruti Suzuki ప్రముఖ కార్ల తయారీ కంపెనీ “మారుతీ సుజుకీ”కి బిగ్ షాక్ తగిలింది. ప్యాసింజర్ వెహికల్ రంగంలో డీలర్ డిస్కౌంట్ కంట్రోల్ పాలసీ అమలు చేయడం ద్వారా యాంటీ-కాంపిటీటివ్(పోటీ-వ్యతిరేక)కార్యకలాపాలకు పాల్పండిందన్న కారణాలతో మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ కి సోమవారం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) రూ.200 కోట్ల జరిమానా విధించినట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
కార్ల డీలర్లు ఇచ్చే డిస్కౌంట్లపై మారుతీ సుజుకీ కంపెనీ పరిమితులు విధిస్తోందని..డీలర్ల మధ్య పోటీని సమర్థవంతంగా అణచివేస్తుందని..డీలర్లపై కంపెనీ ఒత్తిడి వల్లే వినియోగదారులకు మరింత మేలు జరగడం లేదని గతంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 2019 నుంచి ఈ కంపెనీపై దర్యాప్తు జరుగుతోంది. తాజాగా ఈ దర్యాప్తును ముగించిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ).. మారుతి సుజుకి కంపెనీపై రూ.200 కోట్ల జరిమానా విధించింది. ఇక నుంచి అటువంటి విధానాలకు పాల్పడకుండా నిలిపివేయాలి లేదా విరమించుకోవాలని ఉత్తర్వుల్లో మారుతిని కోరింది సీసీఐ. అలాగే, తాము విధించిన జరిమానాను 30 రోజుల్లోగా డిపాజిట్ చేయాలని కంపెనీని సీసీఐ ఆదేశించింది.
అయితే గతంలో ఈ విషయంపై మాట్లాడిన మారుతి సుజుకి.. తాము ఇలా ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని పేర్కొంది. అయితే మారుతి సుజుకి అధికారులకు, కార్ల డీలర్లకు మధ్య జరిగిన ఈ-మెయిల్ సంభాషణలను సీసీఐ బయటపెట్టినట్లు తెలుస్తోంది. వీటిలో డిస్కౌంట్లపై కార్ల కంపెనీ పరిమితులు విధించినట్లు స్పష్టమైందట. మారుతి సుజుకి కంపెనీలో అధికభాగం షేర్లు జపాన్‌కు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ చేతిలో ఉన్న విషయం తెలిసిందే.