Maruti Suzuki SUV Cars : మారుతి సుజుకి నుంచి రెండు కొత్త మోడల్ SUV కార్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?
Maruti Suzuki SUV Cars : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) నుంచి రెండు కొత్త మోడల్ కార్లు రాబోతున్నాయి.

Maruti Suzuki Fronx, Jimny launch details revealed
Maruti Suzuki SUV Cars : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) నుంచి రెండు కొత్త మోడల్ కార్లు రాబోతున్నాయి. మారుతి కంపెనీకి చెందిన ఫ్రాంక్స్ (Fronx), జిమ్నీ (Jimny) అనే రెండు మోడల్ కార్లు ఏప్రిల్ రెండో వారంలో లాంచ్ కానున్నాయి.
ఈ రెండు మోడళ్ల లాంచ్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలను కంపెనీ రివీల్ చేసింది. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఏప్రిల్ రెండో వారంలో లాంచ్ కానుండగా.. మారుతి సుజుకి జిమ్నీ ఆ వెంటనే లాంచ్ కానుంది. ఇప్పటివరకు, Fronx మోడల్ కారు 15,500 బుకింగ్‌లు నమోదయ్యాయి.
రోజుకు దాదాపు 218 బుకింగ్‌లు అయ్యాయి. జిమ్నీకి 23,500 బుకింగ్‌లు వచ్చాయి. రోజుకు దాదాపు 331 బుకింగ్‌లు వచ్చాయి. రెండు SUVలకు సంబంధించి బుకింగ్‌లు జనవరి 12న ప్రారంభమయ్యాయి. ఆటో ఎక్స్పో 2023లో ఆవిష్కరించిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధర రూ. 6.75 లక్షల నుంచి రూ. 11 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉండవచ్చు. మారుతి సుజుకి జిమ్నీ ధర రూ. 9 లక్షల నుంచి రూ. 13 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు. ఈ ఫ్రాంక్స్ కారు సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా ఐదు వేరియంట్లలో రానుంది. జిమ్నీకి జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లు మాత్రమే ఉన్నాయి.

Maruti Suzuki SUV Cars : Maruti Suzuki Fronx, Jimny launch details revealed
Fronx రెండు ఇంజన్ ఆప్షన్లను కలిగి ఉంది. K12N 1.2-లీటర్ Dual-Jet Dual-VVT, పెట్రోల్ (90PS/113Nm), K10C 1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ పెట్రోల్ (100PS/148Nm) ఉండగా, K12N ఇంజిన్ 5-స్పీడ్ MT, 5-స్పీడ్ AMT ఆప్షన్లను కలిగి ఉంది. అయితే, K10C ఇంజిన్ 5-స్పీడ్ MT, 6-స్పీడ్ AT ఆప్షన్ కలిగి ఉంది. జిమ్నీలో 1.5-లీటర్ K15B పెట్రోల్ ఇంజన్ (103PS/134Nm) ఉంది. దీనిని 5-స్పీడ్ MT లేదా 4-స్పీడ్ ATతో కలిగి ఉండవచ్చు. SUV సుజుకి ALLGRIP PRO 4WD టెక్నాలజీ లో-రేంజ్ ట్రాన్స్ఫర్ గేర్ (4L మోడ్)తో ప్రామాణికంగా వస్తుంది.